Karthi: కార్తీని థియేటర్ నుంచి బయటకు గెంటేశారట!

Advertisement

తమిళ స్టార్ హీరో కార్తీ (Karthi) మంచితనం గురించి అందరికీ తెలిసిన విషయం.. ఆయన ఎంత పెద్ద స్టార్ అయినా కూడా ఎంతో సింపుల్‌గా ఉంటాడు. ఇటీవల తన బర్త్‌డే సందర్భంగా మీడియాతో మాట్లాడిన సందర్భంగా, ఒక ఆసక్తికరమైన సంఘటనను గుర్తు చేశాడు. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టే ముందు, కాలేజీ రోజుల్లో తనకు సినిమాలంటే ఉన్న ఆసక్తి, అనుభవాల్ని పంచుకున్న కార్తీ, ‘రంగీలా’ సినిమా కోసం తన చేసిన పని అందరికీ నవ్వులు తెప్పిస్తోంది.

Karthi

ఆ ఇంటర్వ్యూలో కార్తీ చెప్పిన విధంగా, తన్హా తన్హా పాటకు ఫిదా అయిపోయిన ఆయన, ఒక్కసారి కాదు, అనేకసార్లు రంగీలా సినిమా థియేటర్‌లో చూశాడు. ఒకసారి టికెట్ లేకుండానే లోపలికి వెళ్లిపోయారు. కానీ ఆ తర్వాత థియేటర్ సిబ్బంది గుర్తించి బయటకు గెంటేసారట. అంతేకాదు, తర్వాత షోకి తిరిగి టికెట్ తీసుకొని మళ్లీ సినిమా చూశారని చెప్పాడు. ఇది వింటే నిజంగా సినీ అభిమానుల్లోని మురిపాన్ని గుర్తుచేస్తుంది.

ప్రస్తుతం కార్తీ వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. సర్దార్ 2 (Sardar 2), కైది 2 వంటి భారీ ప్రాజెక్ట్స్‌తో పాటు హిట్ 4 సినిమా మీద కూడా హైప్ ఉంది. హిట్ 3లో (HIT 3) గెస్ట్ అప్పీరెన్స్ చేయగా, ఆయన పాత్రపై ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. తెలుగులోనూ కార్తీకి మంచి ఫాలోయింగ్ ఉంది. ద్విభాషా చిత్రాల వలన తమిళంతో పాటు టాలీవుడ్ ఆడియన్స్‌తో కూడా మంచి కనెక్ట్ ఏర్పడుతోంది.

ఇప్పుడిప్పుడే హిట్ 4 గురించి బజ్ మొదలవుతోంది. తమిళనాడు బోర్డర్ నేపథ్యంతో కథ సాగుతుందన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇక సర్దార్ 2 వచ్చే నెలల్లో థియేటర్లలోకి రానుండటంతో, కార్తీ అభిమానులు మరోసారి థ్రిల్ అనుభవించడానికి సిద్ధమవుతున్నారు. ఆ కథలోనూ కార్తీ మాస్ యాంగిల్ ఎలా చూపిస్తారో అనే అంచనాలు మొదలయ్యాయి.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus