Prabhas: పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ బాకీ తీర్చేస్తున్న ప్రభాస్‌.. ఆ యువ దర్శకుడి కథకు ఓకే చెప్పారా?

ప్రేమాభిమానాలను మనసులో దాచుకోవడం ప్రభాస్‌కి తెలియదు. కోపం కూడా దాచుకోడు అని అంటారు. అప్పుడెప్పుడో ఓం రౌత్‌ని ‘కమ్‌ టు మై రూమ్‌’ అని అనడం మనం వినే ఉంటాం. అది కోపమో, ప్రేమో తెలియదు అనుకోండి. అయితే ఇప్పుడు కూడా ప్రభాస్‌ తన అభిమానాన్ని చూపించే ప్రయత్నం చేస్తున్నాడు. ‘ఆదిపురుష్‌’ సినిమాను తెలుగులో విడుదల చేసి దారుణమైన ఇబ్బందులు పడిన నిర్మాత టీజీ విశ్వప్రసాద్‌.. ఆ తర్వాత ‘రాజాసాబ్‌’ చేసి ఇంకా ఇబ్బందులు పడ్డారు.

Prabhas – Karthik Gattamneni

అయితే, ఆ ఇబ్బందుల కారణమో లేక మరే కారణమో కానీ.. ప్రభాస్‌ ఇప్పుడు విశ్వప్రసాద్‌కి మరో ఛాన్స్‌ ఇవ్వాలని అనుకుంటున్నారట. గత కొన్ని రోజులుగా ఈ వార్త సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇప్పుడు ఈ విషయంలో అప్‌డేట్‌ వచ్చింది. ‘మిరాయ్’ సినిమా దర్శకుడు కార్తిక్‌ ఘట్టమనేని ఇప్పుడు ప్రభాస్ కోసం ఓ కథ లైన్‌ను వినిపించారట. ప్రభాస్‌ ఆసక్తి చూపించడంతో పూర్తి స్థాయి కథను సిద్ధం చేసే పనిలో పడ్డారట.

కార్తిక్‌ ఘట్టమనేని గురించి మీకు తెలిసిందే. ఆయన 11 ఏళ్ల క్రితమే దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చారు. అప్పటికే ఆయన సినిమాటోగ్రాఫర్‌గా మంచి పేరే తెచ్చుకున్నారు. అయితే దర్శకుడిగా ఆ సినిమాతో ఆశించిన పేరు తెచ్చుకోలేదు. ఆ తర్వాత సినిమాటోగ్రాఫర్‌గా కంటిన్యూ అవుతూ వచ్చారు. తొమ్మిదేళ్ల తర్వాత రవితేజను ‘ఈగల్‌’గా తీసుకొచ్చారు. అయినా విజయం రాలేదు. అయితే ‘మిరాయ్‌’ సినిమాతో ఆశించిన విజయం అందుకున్నారు.

ఇప్పుడు ప్రభాస్‌నే డైరెక్ట్‌ చేసే ఛాన్స్‌ అందుకునే పొజిషన్‌లో ఉన్నారు. అయితే గతంలో రవితేజ లాంటి పెద్ద హీరోను హ్యాండిల్‌ చేయడంలో ఇబ్బందిపడ్డ కార్తిక్‌ ఘట్టమనేని ఇప్పుడేం చేస్తారో చూడాలి. ‘మిరాయ్‌’తో ఎవరూ టచ్‌ చేయని కొత్త కథను తీసుకున్నారు. అంతకుముందు తీసిన సినిమాలు కూడా కొత్త తరహా కథలే. కాబట్టి ఇప్పుడు ప్రభాస్‌తో కూడా అలాంటి కథనే చేస్తారని సమాచారం.

రావణుడుని హైలైట్‌ చేస్తున్నారు.. ఆయన భార్యను, హనుమంతుడిని చూపించడం లేదేంటి?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus