రూ.4000 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ‘రామాయణ’ (Ramayana) సినిమాలో హీరో ఎవరు? హీరోయిన్ ఎవరు? విలన్ ఎవరు? సహాయ పాత్రలు ఎవరు? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడం సులభమే. ఎందుకంటే సినిమా రిలీజ్ డేట్ దగ్గరపడుతున్న సందర్భంగా ప్రచారం జోరు పెంచారు కాబట్టి.. అందరికీ తెలిసే ఉంటుంది. పైన చెప్పిన ప్రధాన పాత్రల పరిచయాలు అన్నీ జరిగిపోయాయి. కానీ సినిమాలోని ఓ పాత్ర గురించి ఎక్కడా చూపించడం లేదు, ఇంకో పాత్ర గురించి ప్రస్తావన లేదు.
ఆ పాత్రలే మండోదరి, హనుమంతుడు. ఈ రెండు పాత్రలు లేని రామాయణాన్ని ఎవరూ ఊహించలేరు. కానీ ‘రామాయణ’ సినిమా టీమ్ మాత్రం ఈ రెండు పాత్రల గురించి ఎక్కడా మాట్లాడటం లేదు. నిజానికి మండోదరి పాత్ర గురించి తొలుత మాట్లాడుకున్నారు. ఆ పాత్రను పోషించిన కాజల్ అగర్వాల్ కూడా ప్రచారంలో పాల్గొన్నారు. అయితే ఆ తర్వాత మళ్లీ కనిపించలేదు. ఇక హనుమంతుడు అయితే ఇప్పటివరకు బయటకు రాలేదు.
ప్రచారం సంగతి పక్కన పెడితే సినిమా ప్రచార చిత్రాల్లో ఇప్పటివరకు హనుమంతుడు కనిపించలేదు. ఆ పాత్రను సన్నీ డియోల్ పోషించాడు అనే విషయం ఇప్పటికే బయటకు వచ్చేసింది. కానీ ఎందుకో ఇప్పటివరకు ఆయన్ను చూపించడం లేదు. పోనీ ఆ పాత్ర ఎంటర్ అయ్యే ముందు వరకే తొలి పార్ట్ ‘రామాయణ’ ఉంటుంది. అందుకే చూపించలేదు అనుకుంటే.. రావణుడి పాత్రను బాగానే ఎలివేట్ చేస్తున్నారు ఇప్పటివరకు ప్రచారంలో.
దీంతో అసలు నితేశ్ తివారీ ఏం ఆలోచిస్తున్నారు. ఎందుకు హనుమంతుడి పాత్రను బయటకు చూపించడం లేదు అనే చర్చ జోరుగా జరుగుతోంది. ఆ పాత్ర స్పెషల్‌గా ఉంచి, థియేటర్లలో నేరుగా చూసి ఆ ఫీల్‌ని ఎంజాయ్ చేయాలని టీమ్ అనకుంటుందేమో. ఈ విషయంలో క్లారిటీ రావాలి అంటే సినిమా విడుదల కావాల్సిందే. దీపావళి సందర్భంగా ఈ సినిమా నవంబరు 5న విడుదలవుతోంది.