‘కార్తీక దీపం’ సీరియల్ గురించి తెలియని వారంటూ ఉండరు అనడంలో అతిశయోక్తి లేదు. ఇదొక బుల్లితెర బాహుబలి. 2017 నుండీ 2023 ఫిబ్రవరి వరకు ప్రేక్షకులను అలరించింది. ఈ సీరియల్ పై సోషల్ మీడియాలో వచ్చే మీమ్స్ మరే సీరియల్ కు రాలేదు. అంతలా ఈ సీరియల్ పాపులర్ అయ్యింది. ప్రేక్షాదరణ పొందింది. అయితే 6 ఏళ్ళ పాటు ఈ సీరియల్ సాగడానికి ముఖ్యకారణం.. విలన్ మౌనిత పాత్ర అనే చెప్పాలి.
‘నరసింహ’ సినిమాకి నీలాంబరి (రమ్యకృష్ణ) పాత్ర ఎంత కీలకమో.. ఈ ‘కార్తీక దీపం’ సీరియల్ కి మౌనిత పాత్ర అంత కీలకం అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇక ఈ పాత్రని పోషించింది నటి శోభా శెట్టి. ఈమె ఓ కన్నడ ఆర్టిస్ట్. సీరియల్ లో ఈమె పాత్రని చూసి చాలా మంది ప్రేక్షకులు ఈమెను తిట్టుకున్నారు కానీ.. కుర్ర కారు మాత్రం ఈమె గ్లామర్ కి ఫిదా అయ్యారని చెప్పాలి. ఇదిలా ఉండగా.. శోభా శెట్టి (Shobha Shetty) కొంత కాలంగా ఓ నటుడితో ప్రేమాయణం నడుపుతుందట.
అతను మరెవరో కాదు యశ్వంత్. ‘కార్తీక దీపం’ సీరియల్ లో ఇతను కార్తీక్ తమ్ముడు ఆదిత్య పాత్రలో కనిపించాడు. శోభా శెట్టి – యశ్వంత్ లు చాలా కాలంగా ప్రేమలో ఉన్నారని, త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ ఇన్సైడ్ టాక్ నడుస్తుంది.ఎందుకంటే యశ్వంత్ పుట్టినరోజు సందర్భంగా శోభా శెట్టి ఓ పోస్ట్ పెట్టింది.
‘నా జీవితంలోకి సంతోషం తీసుకొచ్చావ్.. అందుకు నీకు స్పెషల్ థాంక్స్. నా జీవితంలో నువ్వు చాలా ముఖ్యమైన వ్యక్తివి’ అంటూ ఆ పోస్టులో రాసుకొచ్చింది. అంతేకాదు యశ్వంత్ – శోభా శెట్టి కలిసి ‘బుజ్జి బంగారం’ అనే సినిమాలో జంటగా కూడా నటించారు. ఆ టైంలోనే వీరు ప్రేమలో పడినట్లు టాక్ నడుస్తుంది.
అశ్విన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఆ హీరోయిన్లలా ఫిట్ నెస్ కంటిన్యూ చేయాలంటే కష్టమే?
తన 16 ఏళ్ళ కెరీర్లో కాజల్ రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!