Kartikeya3: నిఖిల్‌ – బీజేపీ దోస్తీ అందుకేనా?

  • October 17, 2022 / 05:45 PM IST

పురాతన సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం వెనుక దాగి ఉన్న మిస్టరీ కనిపెట్టి ‘కార్తికేయ’ చేశాడు నిఖిల్. కృష్ణుడే నిజం అంటూ ద్వారక నేపథ్యంలో ‘కార్తికేయ 2’ చేసి మంచి విజయం అందుకున్నాడు. రెండో సినిమా అయితే పాన్‌ ఇండియా స్థాయికి ఎదిగిపోయింది. ఇప్పుడు మూడో సినిమాకు రంగం సిద్ధం చేస్తున్నారని టాక్‌ వినిపిస్తోంది. ఈ సినిమాకు మూడో పార్టు ఉంటుందని రెండో పార్టు ఎండింగ్‌లోనే చెప్పారు. అయితే ఈసారి ఏం చెప్పబోతున్నారు అనేది ఆసక్తికరంగా ఉంచేశారు.

అయితే, రాజకీయ – సినిమా వర్గాల సమాచారం ప్రకారం చూసుకుంటే మూడో ‘కార్తికేయ’ ద్వారక నేపథ్యంలో ఉంటుంది. రాముడు చుట్టూ మూడో ‘కార్తికేయ’ తిరుగుతుందట. దీనికి తగ్గట్టుగా చందూ మొండేటి ఓ కథను సిద్ధం చేస్తారని టాక్‌ వినిపిస్తోంది. దీనికి రాజకీయ వర్గాలకు లింకేంటి అనుకుంటున్నారా? ఉంది.. కచ్చితంగా ఉంది అనేది సోషల్‌ మీడియా మాట. ‘కార్తికేయ 2’ విజయం తర్వాత నిఖిల్‌ – చందూ కాంబోకి బాలీవుడ్‌లోనూ గుర్తింపు వచ్చింది.

ఇదే క్రమంలో భారతీయ జనతా పార్టీ పెద్దలు కొంతమంది ఈ సినిమాను మెచ్చుకున్నారు. ఈ సినిమా నిర్మాతల్లో ఒకరైన అభిషేక్‌ అగర్వాల్‌కు బీజేపీతో మంచి అనుబంధం ఉంది. దీంతో ఆ కోణంలో బీజేపీ లీడర్లు, అగ్ర నాయకులు ఈ సినిమాను మెచ్చుకున్నారేమో అని అనుకున్నారు. కానీ ఇప్పుడు ‘కార్తికేయ 3’ రాముడు చుట్టూ తిరుగుతుంది అనేసరికి వచ్చే ఎన్నికల్లో ప్లస్‌ అవ్వడానికి ఈ సినిమాను వాడుకుందాం అనుకుంటున్నారా? అనే చర్చ రేగింది.

‘ఆదిపురుష్‌’ సినిమాతో ప్రభాస్‌ ఏమన్నా ఉపయోగపడతాడేమో అని వెయిట్‌ చేసిన బీజేపీకి ఆ బొమ్మల సినిమా లాంటి గ్రాఫిక్‌ రాముడు నచ్చలేదు. దీంతో నిఖిల్‌తో ‘కార్తికేయ 3’ తీయించాలని చూస్తున్నారు అనే టాక్‌ నడుస్తోంది. ఇందులో నిజమెంత అనేది చూడాలి. అయితే చందూ మొండేటి నెక్స్ట్‌ సినిమా హృతిక్‌ రోషన్‌తో గీతా ఆర్ట్స్‌లో ఉంటుందని ఆ మధ్య వార్తలొచ్చాయి. మరి ఏది ముందు అనేది చూడాలి.

కాంతార సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఎన్టీఆర్ – సావిత్రి టు చిరు- నయన్.. భార్యాభర్తలుగా చేసి కూడా బ్రదర్- సిస్టర్ గా చేసిన జంటలు..!
తన 44 ఏళ్ల కెరీర్లో చిరంజీవి రీమేక్ చేసిన సినిమాలు మరియు వాటి ఫలితాలు..!
సౌందర్య టు సమంత.. గర్భవతి పాత్రల్లో అలరించిన హీరోయిన్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus