Katrina Kaif: కత్రినా కైఫ్ సంచలన నిర్ణయం వెనుక ఉన్న కథ!

  • July 19, 2021 / 10:39 AM IST

తెలుగు ప్రేక్షకులకు కత్రినా కైఫ్ గురించి పరిచయం అవసరం లేదు. ఆమె హీరోయిన్ గా మారింది మన తెలుగు సినిమా మల్లీశ్వరి తోనే..! అటు తర్వాత బాలయ్యతో అల్లరి పిడుగు సినిమాలో కూడా నటించింది. అయితే బాలీవుడ్ లో ఎక్కువ ఛాన్స్ లు రావడంతో అక్కడే సెటిల్ అయిపోయింది. నిత్యం డేటింగ్ వార్తలతో హాట్ టాపిక్ గా నిలవడం ఈ అమ్మడి స్టైల్.గతంలో రన్బీర్ కపూర్, సల్మాన్ ఖాన్ వంటి స్టార్ హీరోలతో ఈమె డేటింగ్ చేసిన సంగతి తెలిసిందే.

ఓ దశలో ఆ హీరోలతో ఈమె పెళ్లి ఉంటుంది అనే కథనాలు వినిపించాయి.కానీ అది జరగలేదు. ప్రస్తుతం ఈ అమ్మడు విక్కీ కౌశల్ తో ప్రేమలో ఉంది.ఇప్పుడు కూడా అతనితో పెళ్లి ఫిక్స్ అనే వార్తలు వినిపిస్తున్నాయి. 40 ఏళ్ళు నిండకుండానే పెళ్లి చేసుకోవాలని కత్రినా భావిస్తుంది.ఇటీవల 38 వ ఏట అడుగుపెట్టిన కత్రినా… త్వరలో పెళ్లి కూతురు కాబోతోంది అంటూ ప్రచారం జరుగుతుంది.

చాలా మంది సెలబ్రిటీలు కూడా ఈమె పెళ్లి చేసుకోవాలని కోరుతున్నట్టు సోషల్ మీడియాలో కామెంట్లు పెట్టారు.ఇందులో సల్మాన్ ఖాన్ మేనేజర్ కూడా ఉండడం గమనార్హం.

Most Recommended Video

పెళ్లి దాకా వచ్చి విడిపోయిన జంటలు!
తమిళ హీరోలు తెలుగులో చేసిన స్ట్రైట్ మూవీస్ లిస్ట్!
దర్శకులను ప్రేమించి పెళ్లి చేసుకున్న హీరోయిన్స్

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus