‘భాషా’ సినిమా ఓ ట్రెండ్ సెట్టర్. 3 దశాబ్దాల నుండి ‘భాషా’ ని ఆధారం చేసుకుని ‘మాస్టర్’ ‘సమరసింహారెడ్డి’ ‘నరసింహనాయుడు’ ‘ఇంద్ర’ ‘మిర్చి’ ‘నాయక్’ వంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి. ఎన్టీఆర్ ‘సాంబ’ కూడా అల్మోస్ట్ ఇదే లైన్.గోపిచంద్ ‘శౌర్యం’ కూడా అల్మోస్ట్ ఇదే లైన్ తో రూపొందింది. ఇంకా ఎన్నో సినిమాలు ‘భాషా’ స్పూర్తితో రూపొందాయి. రజనీకాంత్ మార్కెట్ ని 10 రెట్లు పెంచిన సినిమా ఇది.
అయితే ‘భాషా’ కి స్పూర్తి చిరంజీవి నటించిన ఓ సూపర్ హిట్ సినిమా అని మీకు తెలుసా?వినడానికి విడ్డూరంగా ఉన్నా ఇది నిజం. రజినీకాంత్ ను సూపర్ స్టార్ గా నిలబెట్టిన ‘భాషా’ సినిమాకి మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘గూండా'(Goonda) స్పూర్తి. రెండు సినిమాల్లోనూ హీరో బ్యాక్ డ్రాప్ వేరేగా ఉంటుంది.
ఉదాహరణకి ‘గూండా’ తీసుకుంటే హీరో కలకత్తాలో పేరుమోసిన గూండా. పోలీస్ ఎటాక్ లో తనని పెంచి పెద్ద చేసిన వ్యక్తి చనిపోతూ.. ‘రౌడీయిజాన్ని వదిలేసి మంచి లైఫ్ ని స్టార్ట్ చేయమని’ కోరతాడు.
తర్వాత హీరో ఐడెంటిటీ మార్చుకుని తన తండ్రికి అలాగే కుటుంబానికి దగ్గరవుతాడు. ఓ పక్క సాధారణ వ్యక్తిగా ఉంటూ తన కుటుంబాన్ని విలన్ బారి నుండి కాపాడుకుంటాడు.’బాషా’ చూసుకుంటే హీరో ముంబైలో పెద్ద డాన్.తండ్రి చివరి కోరిక మేరకు వేరే ఊరు వెళ్ళిపోయి ఫ్యామిలీని కాపాడుకోవడానికి సాధారణ జీవితాన్ని గడుపుతాడు. ఇలా 2 సినిమాల కథలు ఆల్మోస్ట్ సిమిలర్ గా ఉంటాయి. కానీ ‘భాషా’ కి వచ్చిన పేరు చిరంజీవి ‘గూండా’ కి రాలేదు.
కానీ ‘గూండా’ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి డూప్ లేకుండా చేసిన కొన్ని యాక్షన్ సీన్స్ అప్పట్లో టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యాయి. ముక్యంగా ట్రైన్ కింద వ్రేలడుతూ చేసిన స్టంట్ అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఏ.కోదండరామిరెడ్డి ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. 1984 ఫిబ్రవరి 23న ఈ సినిమా రిలీజ్ అయ్యింది. నేటితో ఈ సినిమా రిలీజ్ అయ్యి రూ.42 ఏళ్ళు పూర్తికావస్తోంది. అది మేటర్.