Kayadu Lohar: హీరోయిన్లకు నరకం చూపిస్తున్న తెలంగాణ రాజకీయాలు.. ఇప్పుడు మూడో నాయిక

సినిమాలు – రాజకీయాలు.. ఈ రెండు రంగాలకు మధ్య దూరం చాలా తక్కువ అని అంటుంటారు. అయితే ఇది సినిమా తారలు ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఈ మాట వాడుతుంటారు. అయితే మరో రకంగా కూడా ఇప్పుడు ఈ రెండు రంగాల మధ్య దూరం తక్కువగా ఉంది అని చెప్పొచ్చు. అదే పొలిటిషీయన్లు – హీరోయిన్లు తెలంగాణ రాజకీయాలను, అందులోని చర్చలను గత కొన్నేళ్లుగా చూస్తున్న వారికి ఈ విషయం బాగా అర్థమవుతుంది.

Kayadu Lohar

సింపుల్‌గా చెప్పాలటే తెలంగాణ రాజకీయాల్లో కొంతమంది చేసే కామెంట్లు, విమర్శలు, వేసే అభాండాల వల్ల తెలుగు సినిమా హీరోయిన్లు మనోవేదనకు గురవుతున్నారు. కెరీర్‌లు పాడుచేసుకుంటున్నారు అంటే అతిశయోక్తి కాదు. సోషల్ మీడియా ఓపెన్ చేస్తే ఈ రాజకీయ నాయకుడు, ఆ హీరోయిన్‌ అంటూ లేని పోని బంధాలు అంటగట్టేస్తున్నారు. రకుల్ ప్రీత్ సింగ్ పేరు ఎలా, ఎవరికితో కనెక్ట్‌ అయి తెలంగాణ రాజకీయాల్లో నడుస్తోందే అందరికీ తెలిసిందే .

కొన్ని నెలల క్రితం మీనాక్షి చౌదరి పేరును ఇలానే చర్చల్లోకి తీసుకొచ్చారు. ఎవరితోనో ఆమెను ముడిపెట్టి లేని పోని అభాండాలు వేశారు. ఇప్పుడిప్పుడే ఆ డిస్కషన్‌ సమసిపోతోంది అంటుండగా, కయాదు లోహర్‌ పేరు బయటకు వచ్చింది. తెలంగాణకు చెందిన ఓ నేతతో ఆమెకు సంబంధం ఉందని, ఏకంగా విల్లా రాసిచ్చారంటూ వెబ్‌ మీడియాలో కూడా వార్తలొచ్చాయి. ఆమె మీద గతంలో వచ్చిన ఆరోపణలు కూడా విమర్శలకు బలం చేకూరుస్తున్నాయి.

హీరోయిన్లు మాత్రమే కాదు, క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌లు, టీవీ ఆర్టిస్ట్‌లు, సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు ఇలా చాలా మంది మహిళలు ఈ రాజకీయ విమర్శలు ఎదుర్కొంటున్న వారిలో ఉన్నారు. ఈ వ్యాఖ్యలు కుటుంబ జీవితాలను ఇబ్బందుల్లోకి నెడతాయి అని తెలిసినా ఈ వ్యాఖ్యలు ఆగడం లేదు. చూస్తుంటే ఈ లేనిపోని చర్చలు ఎక్కడికి దారి తీస్తాయో అర్థం కావడం లేదు.

ఫ్లాప్‌ సినిమాకు సపోర్టు చేయక్కర్లేదు.. హిట్‌ సినిమాకు అయినా భుజం కాయండబ్బా

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus