Allu Aravind:’కీడా కోలా’ లో అల్లు అరవింద్ పాత్ర అలా మిస్ అయ్యిందట..!

  • October 26, 2023 / 02:59 PM IST

తరుణ్ భాస్కర్ ‘కీడా కోలా’ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ చిత్రం టీజర్, ట్రైలర్.. రెండూ కూడా చాలా కొత్తగా ఉన్నాయి. తరుణ్ భాస్కర్ నుండి ఆశించే ఎంటర్టైన్మెంట్ కూడా పుష్కలంగా ఉండేలా కనిపిస్తుంది. ఇక ఈ చిత్రంలో విశేషాలు చాలానే ఉన్నాయి. అందులో బ్రహ్మానందం పాత్ర ఒకటి అని తెలుస్తుంది. అయితే ట్రైలర్లో ఆయన వీల్ చైర్ పై కనిపించారు. ఆ పాత్ర పేరు వరదరాజులు అని తెలుస్తుంది. సినిమా అంతా ఆయన వీల్ చైర్ పైనే కనిపిస్తారట. అయితే ఈ పాత్రకి దర్శకుడు తరుణ్ భాస్కర్ ముందుగా అనుకున్న వ్యక్తి పేరు.

వివరాల్లోకి వెళితే.. వరదరాజులు అనే పాత్రని దర్శకుడు తరుణ్ భాస్కర్ ముందుగా టాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ తో చేయించాలి అని అనుకున్నాడట. ఈ పాత్ర గురించి అల్లు అరవింద్ కి తరుణ్ భాస్కర్ చెప్పగా … ఆయన నవ్వేసి ఊరుకున్నారట. అందుకే బ్రహ్మానందం ని ఎంపిక చేసుకున్నట్టు తెలుస్తుంది.అయితే గతంలో అల్లు అరవింద్ కూడా పలు సినిమాల్లో నటించారు.చిరంజీవి హీరోగా నటించిన ‘చంటబ్బాయ్’ ‘హీరో’ ‘మహానగరంలో మాయగాడు’ వంటి సినిమాల్లో అల్లు అరవింద్ నటించడం జరిగింది.

ఈయన (Allu Aravind)సినిమా వేడుకల్లో స్టేజి పై అగ్ర నిర్మాతగా ఎంతో హుందాగా కనిపిస్తూనే ప్రవర్తిస్తూనే మరోపక్క కామెడీ కూడా చేస్తుంటారు. బహుశా అందుకే తరుణ్ భాస్కర్ అల్లు అరవింద్ ని మరోసారి నటుడిగా మార్చాలని ప్రయత్నించి ఉండొచ్చు.

 

భగవంత్ కేసరి సినిమా రివ్యూ & రేటింగ్!

లియో సినిమా రివ్యూ & రేటింగ్!
టైగర్ నాగేశ్వరరావు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus