బాలయ్యకి నో చెప్పిందా??

  • April 4, 2017 / 09:31 AM IST

టాలీవుడ్ లో రికార్డుల ప్రభంజనానికి కేర్ ఆఫ్ అడ్రెస్ అయిన నందమూరి వంశానికి వారసుడు నందమూరి బాలకృష్ణ, ఇండస్ట్రీలో తనకంటూ ఒక మైలెజ్, ఒక ప్రత్యేకత ఉంది అనే చెప్పాలి…. ఇక ఈ ఏడాది ప్రతిష్టాత్మక 100వ చిత్రం గౌతమీ పుత్ర శాతకర్ణితో బ్లాక్ బస్థర్ హిట్ అందుకున్న బాలయ్య తన తరువాత సినిమాలపై మంచి జోరు మీద ఉన్నాడు…ఇదిలా ఉంటే…బాలయ్య తో సినిమాలో అవకాశం వస్తే చాలు అనుకునే క్రమంలో…ఒక హీరోయిన్ బాలయ్యకి నో చెప్పిందంటా….ఇంతకీ ఎవరా హీరోయిన్…ఏమా కధ అంటే….ఒకసారి ఈ కధ చదవండి….నేను శైలజ చిత్రంతో తెలుగు ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన మళియాల బ్యూటీ కీర్తి సురేష్ వరుస విజయాలతో తెలుగు, తమిళ ఇండస్ట్రీలో మంచి ఫామ్ లో ఉంది.

తాజాగా ఓ సినిమాలో నటసింహం నందమూరి బాలకృష్ణ తో నటించే ఛాన్స్ వస్తే ఈ భామ కాదని చెప్పి అవమానించిందట. దీంతో ఆఫర్ ఇచ్చిన సినీ పెద్దలు కాస్త సీరియస్ అయ్యీ… తన స్థాయిని తెలుసుకోమని చెప్పగా…..అబ్బే నా ఉద్దేశ్యం అది కాదని..తాను ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీకి వచ్చిన హీరోయిన్ అని అలాంటిది  అంత పెద్ద సీనియర్ హీరోతో చేయడం అంటే కాస్త భయంగా ఉందని సర్థిచెప్పిందట. అయితే భవిష్యత్ లో తప్పకుండా బాలకృష్ణ సార్ తో నటిస్తానని అంటోంది కీర్తి సురేష్. అయితే మంచి క్రేజ్ తో అటు తెలుగులోను ఇటు తమిళ్ లోను వరుస ఆఫర్స్ తో దూసుకుపోతున్న క్రమంలో బాలయ్యతో సినిమాను ఒప్పుకోలేదని ఇన్‌సైడ్ టాక్…మొత్తంగా చూసుకుంటే ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ గా సినిమా సర్కిల్స్ లో చక్కెర్లు కొడుతున్న విషయం.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus