తమిళంలోకి ఎంట్రీ ఇస్తున్న చిరంజీవి మేనల్లుళ్ల హీరోయిన్‌

తెలుగులో ఐదేళ్ల క్రితం ఎంట్రీ ఇచ్చింది.. ఇప్పటివరకు సరైన విజయం ఒక్కటే అందుకుంది. దీని బట్టి అర్థం చేసుకోవచ్చు ఆ హీరోయిన్‌ పరిస్థితి ఏంటో. అప్పటివరకు వరుస ఫ్లాప్‌లు వస్తున్నా సినిమా అవకాశాలు సంపాదించిన ఆ హీరోయిన్‌కి ఎట్టకేలకు విజయం వచ్చినా.. ఆ ఫలితం షేరింగ్‌ కాన్సెప్ట్‌లో పడటంతో ఆమెకు ఆశించినంత పేరు రాలేదు అనే అంటారు. అందుకేనేమో ఆ తర్వాత తెలుగులో మరో అవకాశం రాలేదు. ఎవరీమె అనుకుంటున్నారా? ఇంకెవరు కేతిక శర్మ.

Ketika Sharma

‘రొమాంటిక్‌’ సినిమాతో 2021లో ఆకాశ్‌ పూరికి జోడీగా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత కాస్త పేరున్న హీరోలతోనే సినిమాలు చేసింది. శర్వానంద్‌ ‘లక్ష్య’, వైష్ణవ్‌తేజ్‌ ‘రంగ రంగ వైభవంగా’, సాయిధరమ్‌ తేజ్‌ ‘బ్రో’, నితిన్‌తో ‘రాబిన్‌హుడ్‌’ చేసింది. ఇవేవీ ఆమెకు విజయాలు ఇవ్వలేదు. దీంతో ఒకానొక సమయంలో ఐరెన్‌ లెగ్‌ అనిపించుకుంది. ఆ సమయంలో ‘సింగిల్‌’ సినిమా చేసి తొలి హిట్‌ కొట్టింది. ఆ తర్వాత వరుస ఛాన్స్‌లు వస్తాయనుకుంటే రాలేదు.

అలా అని సినిమాలు చేయడం లేదా అనుకోవద్దు. ఎందుకంటే ‘మీసయ్య మురుక్కు 2’ సినిమాలో నటిస్తోంది. హిపాప్‌ తమిళ ఆది తెరకెక్కిస్తున్న ఆ సినిమాలో హిపాప్‌ తమిళ ఆది, చైత్ర జె ఆర్చర్‌, యోగిబాబు ఇతర ప్రధాన పాత్రధారులు. ఈ సినిమాను ఈ నెల 25న రిలీజ్‌ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రచార కార్యక్రమాల్లో ఆమె కనిపించడంతో ఈ విషయం బయటకు వచ్చింది. ఇదే కాదు రాజేష్‌ ఎం సెల్వ తెరకెక్కిస్తున్న మరో సినిమాలోనూ కేతిక నటిస్తోంది.

ఎన్ని ప్రయత్నాలు చేసినా తెలుగులో సరైన విజయం అందుకోని హీరోయిన్లకు తమిళంలో వరుస విజయాలు రావడం మనం గతంలో చూశాం. ఆ లెక్కన కేతికకు కూడా ఓ ఛాన్స్‌ వచ్చింది. మరి కోలీవుడ్ కేతిక ఎలాంటి ప్రభావం చూపిస్తుందో చూడాలి.

దాదా సాహెబ్‌ అనంత్‌ నాగ్‌ గురించి తెలుసా? మనం చూడనివి…

 

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus