Kiraak RP: హీరోయిన్ చేతుల మీదుగా మరో బ్రాంచ్ ప్రారంభించనున్న ఆర్పీ!

జబర్దస్త్ కార్యక్రమంలో కమెడియన్ గా కొనసాగుతూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి కిరాక్ ఆర్పీ ఈ కార్యక్రమం ద్వారా తన కామెడీతో పెద్ద ఎత్తున అందరిని సందడి చేశారు అయితే వారితో ఈయనకు మనస్పర్ధలు రావడంతో ఈ కార్యక్రమం నుంచి బయటకు వచ్చారు. ఇలా జబర్దస్త్ వీడిన తర్వాత స్టార్ మాలో ప్రసారమవుతున్నటువంటి కామెడీ షోలలో సందడి చేసినటువంటి ఈయన అనంతరం బుల్లితెర కార్యక్రమాలకు పూర్తిగా గుడ్ బై చెప్పారు.

ఇలా బుల్లితెర కార్యక్రమాలకు దూరమైనటువంటి  (Kiraak RP) కిరాక్ ఆర్పీ రెస్టారెంట్ బిజినెస్ లోకి అడుగుపెట్టారు. ఈయన నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు అనే పేరిట చేపల పులుసు రెస్టారెంట్ ప్రారంభించి ఈ రెస్టారెంట్ బిజినెస్ లో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. మొదట్లో హైదరాబాద్లో ఈ బిజినెస్ ప్రారంభించిన ఈయన ఇప్పటికే హైదరాబాదులో ఎన్నో బ్రాంచ్ లను ఏర్పాటు చేసిన సంగతి మనకు తెలిసిందే. ఇలా హైదరాబాద్లో మాత్రమే కాకుండా ఆంధ్రలో కూడా నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు రెస్టారెంట్ ప్రారంభించారు.

ఇక ఇప్పటికే ఆంద్రాలో పలు జిల్లాలలో ఈ చేపల పులుసు రెస్టారెంట్ ఉన్న సంగతి మనకు తెలిసిందే. ఇక రాయలసీమలో అనంతపురం జిల్లాలో చేపల పులుసు రెస్టారెంట్ ప్రారంభించినటువంటి ఈయన త్వరలోనే తిరుపతిలో మరొక బ్రాంచ్ ఏర్పాటు చేయబోతున్నారని తెలుస్తోంది. ఇదే విషయాన్ని ఆర్పి వెల్లడించారు. అయితే నవంబర్ 19వ తేదీ ఉదయం 10 గంటలకు ఈ రెస్టారెంట్ ప్రారంభం కాబోతుందని ఈయన వెల్లడించారు.

ఇక ఈ రెస్టారెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రముఖ నటి మెహరీన్ హాజరు కాబోతున్నారని ఆమె చేతుల మీదుగానే ఈ బ్రాంచ్ ప్రారంభించబోతున్నట్లు కిరాక్ ఆర్పీ వెల్లడించారు. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతోమంది ఈయన వ్యాపార రంగంలో అభివృద్ధి చెందడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ శుభాకాంక్షలు తెలియజేయడమే కాకుండా ఇలాగే మీ వ్యాపారం మరింత అభివృద్ధి చెందాలి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

‘పుష్ప’ టు ‘దేవర’.. 2 పార్టులుగా రాబోతున్న 10 సినిమాలు..!

‘సైందవ్’ తో పాటు టాలీవుడ్లో వచ్చిన ఫాదర్-డాటర్ సెంటిమెంట్ మూవీస్ లిస్ట్..!
ఆ హీరోయిన్స్ చేతిలో ఒక సినిమా కూడా లేదంట..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus