టాలీవుడ్ ఇండస్ట్రీలో టాలెంట్ తో అంచెలంచెలుగా ఎదిగి కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. రాజావారు రాణివారు (Raja Vaaru Rani Gaaru) , ఎస్.ఆర్ కళ్యాణమండపం, (SR Kalyanamandapam) సమ్మతమే (Sammathame) సినిమాలతో ఈ హీరో విజయాలను అందుకున్నారు. త్వరలో ఈ హీరో పెళ్లి పీటలెక్కనుండగా పెళ్లి తేదీకి సంబంధించిన వివరాలు తాజాగా లీకయ్యాయి. రహస్య (Rahasya Gorak) అనే హీరోయిన్ ను కిరణ్ అబ్బవరం పెళ్లి చేసుకోనున్న సంగతి తెలిసిందే. రహస్య గోరక్ సోషల్ మీడియా ద్వారా కిరణ్ అబ్బవరంకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడంతో పాటు మరో 38 రోజుల్లో పెళ్లి జరగనున్నట్టు వెల్లడించారు.
“హ్యాపీ బర్త్ డే కిరణ్ అబ్బవరం.. మరో 38 రోజుల్లో నిన్ను మై హస్బెండ్ అనేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను” ఆమె తన పోస్ట్ లో పేర్కొన్నారు. రహస్య గోరక్ చేసిన ఈ పోస్ట్ ఫ్యాన్స్ కు ఎంతగానో ఆనందాన్ని కలిగిస్తోంది. ఆగష్టు నెల నాలుగో వారంలో కిరణ్ రహస్య వివాహం జరగనుందని ఆమె చేసిన కామెంట్ల ద్వారా అర్థమవుతోంది. కిరణ్ అబ్బవరం త్వరలో తన పెళ్లికి సంబంధించి కీలక ప్రకటన చేసే అవకాశాలు అయితే ఉన్నాయి.
కిరణ్ అబ్బవరం కెరీర్ ను జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటే అతని ఖాతాలో మరిన్ని భారీ విజయాలు చేరడం పక్కా అని చెప్పవచ్చు. కిరణ్ అబ్బవరం నటించిన క మూవీ నుంచి విడుదలైన టీజర్ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. “క” టీజర్ కు యూట్యూబ్ లో రికార్డ్ స్థాయిలో వ్యూస్ వస్తున్నాయి.
కిరణ్ అబ్బవరం కోరుకునే హిట్ ఈ సినిమాతో దక్కనుందని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వినిపిస్తున్నాయి. “క” సినిమాలో యాక్షన్ సన్నివేశాలు సైతం స్పెషల్ గా ఉండనున్నాయని తెలుస్తోంది. కిరణ్ అబ్బవరం బ్యాక్ టు బ్యాక్ విజయాలతో కెరీర్ పరంగా సత్తా చాటితే ఫ్యాన్స్ సంతోషానికి అవధులు ఉండవని చెప్పవచ్చు.