అఖిల్ అక్కినేని (Akhil Akkineni) నుండి ‘ఏజెంట్’ (Agent) తర్వాత మరో సినిమా రాలేదు.’యూవీ క్రియేషన్స్’ బ్యానర్లో అఖిల్ ఓ భారీ బడ్జెట్ సినిమా చేయాలి. అనిల్ ఆ సినిమాని డైరెక్ట్ చేయాలి. కానీ పేపర్ పైనే ఆ సినిమాకు రూ.100 కోట్లు బడ్జెట్ అవుతుందని తేలిందట. మరోపక్క అదే బ్యానర్లో మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ‘విశ్వంభర’ (Vishwambhara) ప్రాజెక్టు తెరకెక్కుతుంది. దానికి రూ.160 కోట్ల వరకు బడ్జెట్ అవుతుంది. దీంతో ఒకేసారి రెండు వంద కోట్ల ప్రాజెక్టులను నిర్మించలేక అఖిల్ ప్రాజెక్టుని హోల్డ్ లో పెట్టారు నిర్మాతలు.
అయితే ఆ సినిమా కోసం అఖిల్ మేకోవర్ కంప్లీట్ గా మార్చుకున్నాడు.గుబురు గడ్డంతో చాలా రఫ్ గా కనిపిస్తున్నాడు. ఇదిలా ఉండగా.. మరో అప్ కమింగ్ డైరెక్టర్ కి అఖిల్ ఛాన్స్ ఇచ్చినట్లు తెలుస్తుంది. వివరాల్లోకి వెళితే.. ‘వినరో భాగ్యము విష్ణు కథ’ (Vinaro Bhagyamu Vishnu Katha) చిత్రం దర్శకుడితో అఖిల్ సినిమా చేయబోతున్నట్లు ఇప్పుడు ప్రచారం జరుగుతుంది. దీనికి కారణం కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) . ఈరోజు జరిగిన ‘క’ (KA) సక్సెస్ మీట్లో తనతో పనిచేసిన దర్శకులు ఇప్పుడు పెద్ద ప్రాజెక్టులు చేస్తున్నట్లు తెలిపాడు.
ఈ క్రమంలో ‘వినరో భాగ్యము విష్ణుకథ’ కి పనిచేసిన నందు అఖిల్ తో సినిమా చేస్తున్నాడు అని అతను చెప్పుకొచ్చాడు. కానీ ‘వినరో భాగ్యము విష్ణు కథ’ చిత్రానికి దర్శకుడి పేరు మురళీ కిషోర్ అబ్బూరు అని ఉంది. దీంతో చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. కానీ మురళీ కిషోర్ ని చాలా మంది నందు అని పిలుస్తారట. అందుకే కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) అలా చెప్పాడు. ఇక 2023 ఫిబ్రవరిలో వచ్చిన ‘వినరో భాగ్యము విష్ణు కథ’ బాక్సాఫీస్ వద్ద డీసెంట్ హిట్ అందుకుంది. ఆ సినిమాలో ట్విస్ట్..లు బాగా వర్కౌట్ అయ్యాయి. మరి నందు అఖిల్ తో ఎలాంటి సినిమా తీస్తాడో చూడాలి.