Pushpa2: పుష్ప 2: ఐటెమ్ సాంగ్ కోసం ఆమె ఫిక్స్.. లీకైన ఫొటో!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun)  కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న మూవీ పుష్ప 2 (Pushpa2) మరికొన్ని రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు సుకుమార్ (Sukumar) దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే దాదాపు సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఫైనల్ గా సినిమాను డిసెంబర్ 5వ తేదీన విడుదల చేయడానికి బ్యాలెన్స్ వర్క్ ను స్పీడ్ గా ఫినిష్ చేస్తున్నారు.

Pushpa2

సినిమా షూటింగ్ ను నవంబర్ 20 లోపు ఫినిష్ చేయాలని గ్యాప్ లేకుండా కష్టపడుతూనే ఉన్నారు. ఇక సినిమాకు సంబంధించిన ఐటెమ్ సాంగ్ గురించి ఇటీవల కాలంలో అనేక రకాల కథనాలు వైరల్ అయ్యాయి. మొదట సమంత ఐటమ్ సాంగ్ లో కనిపించబోతున్నట్లు టాక్ వచ్చింది. ఆ తర్వాత శ్రద్ధా కపూర్ (Shraddha Kapoor) పేరు కూడా గట్టిగానే వినిపించింది. అయితే ఆమె అత్యధిక స్థాయిలో పారితోషకం డిమాండ్ చేయడంతో చిత్ర యూనిట్ సభ్యులు టాలీవుడ్ వైపు యూ టర్న్ తీసుకున్నారు.

ఇక ఆమె ఎవరు అనే విషయంలో కూడా అనేక రకాల కామెంట్స్ వినిపించాయి. శ్రీలీల దాదాపు ఫైనల్ అయినట్లుగా న్యూ టాక్ వినిపించిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు సోషల్ మీడియాలో లీకైన ఒక ఫోటో ద్వారా ఆ అంశంపై క్లారిటీ వచ్చేసింది. పుష్ప 2 స్పెషల్ సాంగ్ చిత్రీకరణ ప్రస్తుతం హైదరాబాద్ లోనే జరుగుతోంది. ప్రత్యేకంగా వేసిన సెట్ లో అల్లు అర్జున్ తో పాటు శ్రీలీల  (Sreeleela) కూడా పాల్గొంది. ఇక వారి డ్యాన్స్ కు సంబంధించిన ఫొటో కూడా లీక్ అయ్యింది.

డిఫరెంట్ గ్లామర్ లుక్ లో శ్రీలీల ఎంతో అందంగా కనిపిస్తోంది. పుష్పరాజ్ స్టైల్ లో కూడా అల్లు అర్జున్ హైలెట్ అయ్యాడు. చూస్తుంటే ఈ కాంబినేషన్ లో ఐటెం సాంగ్ అదిరిపోతుంది అని అర్థమవుతుంది. ఇక సోషల్ మీడియాలో లీకైన ఈ ఫోటో బాగా వైరల్ అవుతోంది. మొత్తానికి సినిమాలో ఐటెమ్ సాంగ్ ఎవరు చేస్తున్నారు అనే విషయంలో ఒక క్లారిటీ వచ్చేసింది. మరి ఈ పాట ఏ రేంజ్ లో క్లిక్కవుతుందో చూడాలి.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus