కొరటాలా ఎక్కడా తగ్గడం లేదు!

  • August 30, 2016 / 07:31 AM IST

టాలీవుడ్ లో ఒక పక్క చిన్న హీరోలతో చిన్న సినిమాలు సూపర్ డూపర్ హిట్స్ అవుతూ ఉంటే….పెద్ద హీరోల సినిమాలు మాత్రం..ఏమాత్రం బడ్జెట్ కి వెనకాడకుండా భారీ లెవెల్ లో తెరకెక్కుతున్నాయి. అదే క్రమంలో సినిమా ఏమాత్రం తేడా వచ్చినా నిర్మాత పని ఔట్ అంతే…ఇదిలా ఉంటే మన చిత్ర పరిశ్రమలో మన దర్శకుల్లో గుణషేకర్, వినాయక్ లాంటి వాళ్ళు సినిమాకి ఎంత ఖర్చు పెట్టిస్తారో అందరికీ తెలిసిందే…అందులో గుణ షేకర్ అయితే ప్రతీ సినిమాలో భారీ సెట్స్ వేసి మరీ నిర్మాతను ఇబ్బందుల్లో నెడుతూ ఉంటాడు. ఇక అదే క్రమంలో మన వినాయక్ నే తీసుకుంటే…ఈ మధ్య బెల్లంకొండ వారసుడు శ్రీనివాస్ ను తెలుగు తెరకు పరిచయం చేస్తూ తీసిన సినిమా “అల్లుడు సీను”.

ఎలా అయినా కొడుకుని చిత్ర పరిశ్రమలో నిలబెట్టాలి అన్న తపనతో బెల్లంకొండ శ్రీనివాస్ ఈసినిమాకి భారీగానే భర్చుపెట్టాడు…ఒక వినాయక్ సైతం ఎక్కడ తగ్గకుండా ప్రతే పాటలోనూ రెండు మూడు భారీ సెట్స్ వేసి మరీ సినిమాను అందంగా తీర్చి దిద్దాడు. అయితే అదే క్రమంలో సినిమాకు భారీ ఖర్చుఅవడంతో సినిమా బాగా ఆడినప్పటికీ పెట్టిన డబ్బు తిరిగి రాలేదు అన్న వార్త అయితే తెలుసింది. ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడు జనతా గ్యారేజ్ విషయంలో కూడా కొరటాల భారీగానే ఖర్చుపెట్టిస్తున్నట్లు కనిపిస్తుంది. సినిమా విడుదలకు రోజులు దగ్గర పడుతుండటంతో ఒక్కో పాట ప్రోమోతో యాడ్స్ కుమ్మేస్తున్న జనతా టీమ్…తాజాగా ‘దివి నుంచి దిగివచ్చావా యాపిల్ బ్యూటీ..’ అనే పాట ప్రోమో రిలీజ్ చేసింది….ఒక పక్క ఈ పాటలో ఎన్టీఆర్ డ్యాన్స్ ఆదరగొట్టేశాడు అన్న హ్యాపీనెస్ తో అభిమానులు ఉన్నప్పటికీ..మరో పక్క నాలుగు రకాల సెట్టింగ్స్ లో ఈ పాట తీసినట్లుగా స్పష్టంగా కనిపిస్తోంది. ఇక బుల్లితెరమీద చూస్తుంటే కళ్లు జిగేల్మంటున్నాయి. మరి వెండి తెరపై ఈ పాట చూస్తే…అభిమానులు ఏమయిపోతారో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus