Balayya – Koratala: ఫుల్‌ స్వింగ్‌లో బాలయ్య.. మరో సినిమాకు కొబ్బరికాయ కొట్టేస్తున్నారు

మొన్నీమధ్యే ఓ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభించి.. వాయు వేగంతో సినిమా షూటింగ్‌ చేస్తున్న నందమూరి బాలకృష్ణ.. ఇప్పుడు మరో సినిమాకు కొబ్బరి కాయ కొట్టేస్తున్నారు. ఇది సమాచారం కోసం చిత్రబృందమే అధికారికంగా ప్రకటించింది. నందమూరి బాలకృష్ణ 112వ సినిమాకి కొరటాల శివ దర్శకత్వం వహించనున్నారు కొన్ని రోజుల క్రితం చిత్రబృందం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ సినిమా ముహూర్త కార్యక్రమానికి ముహూర్తం పెట్టేశారు.

Balayya – Koratala

ఈ నెల 25న అమరావతి సమీపంలోని వెంకటపాలెంలోని శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో పూజా కార్యక్రమాలతో సినిమా ప్రారంభం కానుందని సినిమా వర్గాలు ఓ పోస్టర్‌లో సోషల్‌ మీడియాలో పోస్టు చేశాయి. అంతేకాదు ఈ వేడుకకు ఆంధప్రదేశ్‌ మంత్రి, బాలకృష్ణ అల్లుడు నారా లోకేశ్‌తోపాటు ఏపీ సినిమాటోగ్రఫీ మినిస్టర్‌ కందుల దుర్గేశ్‌ ముఖ్య అతిథులుగా విచ్చేస్తారని కూడా చెప్పారు. లోకేశ్‌ మంత్రి అయ్యాక మామయ్య సినిమా ముహూర్తం కార్యక్రమానికి రావడం ఇదే తొలిసారి. కాబట్టి కార్యక్రమమంతా సందడిగా సాగనుంది.

ఇక ఈ సినిమా కొరటాల శివ శైలికి తగ్గట్లుగా సామాజిక సందేశం + మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా ఉండబోతోందట. ఈ మేరకు పకడ్బందీగా కథను సిద్ధం చేసుకున్నారు. రీసెంట్‌ ఫలితాలు, ట్రోలింగ్‌ల కారణంగా కొరటాల చాలా జాగ్రత్తగా ఉంటున్నారని టాక్‌. ‘ఆచార్య’, ‘దేవర’ సమయంలో కొరటాల రాత విషయంలో, చిత్రీకరణ విషయంలో పెద్ద ఎత్తున విమర్శలు ఎదుర్కొన్నారు. ఈ సినిమా విషయంలో ఆ ఇబ్బందులు రాకుండా చూసుకుంటున్నారట.

ఈ సినిమాను మేలో అధికారికంగా ప్రకటించారు. అధికారానికి ఉద్దేశం తోడైతే.. అది ఉద్యమంగా మారుతుంది అనే పవర్‌ఫుల్‌ లైన్‌తో సినిమా మీద అంచనాలు పెంచారు. ప్రస్తుతం బాలయ్య గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాలో కాజల్‌ కథానాయికగా నటిస్తుండగా.. మంచు మనోజ్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ రెండు సినిమాలను బాలకృష్ణ ఒకేసారి పూర్తి చేయాలని అనుకుంటున్నారట.

సీక్వెల్‌ రావడానికి 29 ఏళ్లు.. రెండో సీక్వెల్‌కి ఏడాదే.. ఏ సినిమా అంటే..

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus