పవర్ స్టార్ ను డైరక్ట్ చేసేందుకు సిద్ధమవుతున్న కొరటాల శివ

  • September 28, 2016 / 01:31 PM IST

మిర్చి, శ్రీమంతుడు, జనతా గ్యారేజ్ .. ఇలా వరుస హిట్లతో టాలీవుడ్ టాప్ డైరక్టర్ల జాబితాలో కొరటాల శివ చేరిపోయారు. మెసేజ్ ఓరియెంటెడ్ కమర్షియల్ చిత్రాలను తెరకెక్కిస్తూ తన కంటూ ఒక ముద్రను వేసుకున్నారు. ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు కోసం స్రిప్ట్ రెడీ చేస్తున్న ఈ డైరక్టర్ .. పవన్ కళ్యాణ్ తో కూడా సినిమా చేసే ఆలోచనలో ఉన్నట్లు తాజా సమాచారం.

ఆయన రాసి పెట్టుకున్న కథల్లో ఒకటి పవర్ స్టార్ కి బాగా సూట్ అవుతుందని, దాన్ని పూర్తిగా డెవలప్ చేసి త్వరలో ఆయనకు కొరటాల శివ వినిపించనున్నారని తెలిసింది. ప్రస్తుతం కాటమరాయుడు చిత్రీకరణలో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్.. ఆ తర్వాత   త్రివిక్రమ్ తో సినిమా చేయనున్నారు. ఆ సమయంలోపు కొరటాల తన కథతో పవన్ ని మెప్పిస్తే వచ్చే ఏడాది చివర్లో వీరి కాంబినేషన్లో సినిమా సెట్స్ మీదకు వెళ్లే అవకాశం ఉంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus