‘ఉప్పెన’ లో ‘బేబమ్మ’గా అలరించిన కృతి శెట్టి (Krithi Shetty).. ఆ తర్వాత ‘శ్యామ్ సింగ రాయ్ ‘ ‘ బంగార్రాజు ‘ వంటి సినిమాలతో హ్యాట్రిక్ సక్సెస్ ..లు చూసింది. ఆ తర్వాత స్టార్ హీరోల సినిమాల్లో ఈమెకు అవకాశాలు వచ్చాయి. కానీ ‘ ది వారియర్ ‘ ‘మాచర్ల నియోజకవర్గం’, ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’, ‘ది వారియర్’, ‘కస్టడీ’, ‘మనమే’.. ఇలా ఒకదాని వెనుక ఒకటి ఐదు సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి.
దీంతో కృతి శెట్టి సినీ కెరీర్ ఇప్పుడు క్లిష్ట దశకు చేరుకుంది. కెరీర్ ఆరంభంలోనే సంచలన విజయాన్ని అందుకున్న ఈ యంగ్ బ్యూటీ, ఇప్పుడు సక్సెస్ కోసం గట్టిగా పోరాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. తమిళంలో కూడా పెద్ద సినిమాల్లో అవకాశాలు వచ్చినా.. అవి కూడా కలిసి రాలేదు. వా వాతియార్ (అన్నగారు వస్తారు) ఫ్లాప్ అయ్యింది. ఇటీవల వచ్చిన ప్రదీప్ రంగనాథన్ బైలింగ్వల్ మూవీ ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ (LIK) కూడా బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలవ్వడంతో.. అందులో హీరోయిన్ గా చేసిన కృతికి గట్టి దెబ్బ తగిలింది. సో ఇప్పుడు ఆమె కెరీర్ ఆల్మోస్ట్ క్లైమాక్స్ కి వచ్చినట్టే.
కానీ ఇంకా కృతికి ఒక హాప్ ఉంది. ఆ హోప్ పేరు అనిల్ రావిపూడి. ఆమె కెరీర్‌ను నిలబెట్టే బాధ్యత దర్శకుడు అనిల్ రావిపూడిపై పడింది. వెంకటేష్ – కళ్యాణ్ రామ్ కాంబోలో అనిల్ రావిపూడి ఓ ఫ్యామిలీ ఎంటర్టైనర్ తెరకెక్కిస్తున్నాడు. ఇందులో కళ్యాణ్ రామ్ సరసన కృతి శెట్టి హీరోయిన్ గా ఎంపికైంది. ఆ విషయాన్ని ఎల్ ఐ కె ప్రీ రిలీజ్ ఈవెంట్లో అనిల్ రావిపూడి కన్ఫర్మ్ చేశాడు. 2027 సంక్రాంతి బరిలో నిలవనుంది ఈ సినిమా. మరోపక్క తమిళంలో కృతి ఓ భారీ బడ్జెట్ చిత్రం ‘జీనీ’ లో కూడా నటిస్తుంది. ఈ 2 సినిమాలు హిట్ అయితే కృతి శెట్టి కెరీర్ మళ్ళీ ఊపందుకుంటుంది.