Kumari Aunty: ఆ స్టార్ కుమారి ఆంటీ చేసిన కర్రీస్ ఇష్టంగా తింటారా..నమ్మలేమంటూ?

ఈ మధ్య కాలంలో ఓవర్ నైట్ లో పాపులారిటీని సొంతం చేసుకున్న సెలబ్రిటీలలో కుమారి ఆంటీ ఒకరు. కుమారి ఆంటీ యూట్యూబ్ ఛానెళ్లకు ఇస్తున్న ఇంటర్వ్యూల ద్వారా కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కుమారి ఆంటీ వంటకాలను యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఇష్టంగా తింటారట. స్వయంగా కుమారి ఆంటీ ఈ విషయాలను వెల్లడించడం గమనార్హం. ఎన్టీఆర్ డ్రైవర్ తన దగ్గర్ పార్శిల్ తీసుకెళ్తాడని ఆమె అన్నారు. ప్రముఖ కమెడియన్ అలీ డైరెక్ట్ గా వచ్చి తన దగ్గర వంటకాలను కొనుగోలు చేస్తారని ఆమె తెలిపారు.

అయితే కొంతమంది సెలబ్రిటీల డ్రైవర్లు అని చెప్పి ఫుడ్ పార్శిల్స్ తీసుకుంటూ ఉంటారు. కుమారి ఆంటీ వంటకాలను నిజంగానే తారక్ రుచి చూశారో లేదో తెలియాలంటే మాత్రం ఎన్టీఆర్ స్పందించే వరకు ఆగాల్సిందే. యంగ్ టైగర్ ఎన్టీఆర్ భోజన ప్రియుడు అనే సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ వెజ్ వంటకాలతో పాటు నా వెజ్ వంటకాలను సైతం ఎంతో ఇష్టంగా తింటారు. ఎన్టీఆర్ వంట కూడా బాగా చేస్తారనే సంగతి తెలిసిందే.

ప్రస్తుతం స్లిమ్ లుక్ లో కనిపించి ఆకట్టుకుంటున్న తారక్ నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్ లపై దృష్టి పెడుతుండగా దేవర కన్ఫ్యూజన్ కు తెరదించాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. తారక్ వేగంగా సినిమాలలో నటించాలని అభిమానులు భావిస్తున్నారు. కుమారి ఆంటీ ఎన్టీఆర్ గురించి చెప్పడం నిజమే అయ్యి ఉండవచ్చని అయితే నిజంగా ఎన్టీఆర్ టేస్ట్ చేశారో లేదో కచ్చితంగా చెప్పలేమని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి.

కుమారి ఆంటీకి (Kumari Aunty) మళ్లీ ఫుడ్ స్టాల్ నిర్వహించడానికి అనుమతులు లభించడంతో నెటిజన్లు సంతోషిస్తున్నారు. కుమారి ఆంటీకి సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతోంది. త్వరలో రేవంత్ రెడ్డి సైతం ఈ ఫుడ్ స్టాల్ దగ్గర త్వరలో ఫుడ్ టేస్ట్ చేయనున్నారు.

‘గుంటూరు కారం’ లో ఆకట్టుకునే డైలాగులు ఇవే.!

‘గుంటూరు కారం’ తో పాటు సంక్రాంతి సీజన్ వల్ల సేఫ్ అయిన 10 సినిమాల లిస్ట్.!
2023లో అభినయంతో ఆకట్టుకున్న అందాల భామలు.!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus