అతి తక్కువ టైమ్‌లో భారీ ప్రాజెక్టులు అనౌన్స్ చేసి సినీ, ట్రేడ్ వర్గాలకు పెద్ద షాక్ ఇచ్చింది ప్రముఖ నిర్మాణ సంస్థ ‘కె.వి.ఎన్ ప్రొడక్షన్స్'(KVN). దళపతి విజయ్‌తో ‘జన నాయగన్’, ధృవ సర్జాతో ‘కేడీ’ (KD), యశ్‌తో ‘టాక్సిక్’ వంటి పాన్ ఇండియా సినిమాలను కే.వి.ఎన్ సంస్థ ప్రకటించింది. ఈ లిస్ట్‌లో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘కాకా’ సినిమా కూడా ఉంది, అయితే ఇది రీజనల్ మూవీ.వరుసగా భారీ ప్రాజెక్టులు అనౌన్స్ చేయడంతో సౌత్‌లో ‘మైత్రీ మూవీ మేకర్స్’, ‘హోంబలే ఫిల్మ్స్’ స్థాయిలో ‘కె.వి.ఎన్ ప్రొడక్షన్స్’ కూడా అగ్ర నిర్మాణ సంస్థగా ఎదగనుందని అంతా భావించారు.
కానీ సీన్ మొత్తం రివర్స్ అయ్యింది. ఈ బ్యానర్ నుండి మొదటగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘కేడీ’ పెద్ద డిజాస్టర్ అయ్యింది. ఆ తర్వాత ‘జన నాయగన్’ రిలీజ్ కోసం నిర్మాతలు పడిన కష్టాలు తెలిసిందే. అన్ని అడ్డంకులు దాటి రిలీజైనప్పటికీ ‘జన నాయగన్’ కూడా డిజాస్టర్ అయ్యింది. ‘భగవంత్ కేసరి’ కథకు విచిత్రమైన సీజీ వర్క్ జోడించి దారుణంగా తీయడంతో ఆడియన్స్ తిప్పికొట్టారు. తమిళ ప్రేక్షకులు సైతం ఈ సినిమాను పక్కనపెట్టేశారు.
ఇక భారీ అంచనాల నడుమ వచ్చిన ‘టాక్సిక్’ కూడా డిజాస్టర్ కావడంతో ‘కె.వి.ఎన్’ సంస్థకు భారీ నష్టాలు తప్పవని తేలిపోయింది. ఈ నేపథ్యంలో ‘కె.వి.ఎన్ ప్రొడక్షన్స్’ నిలదొక్కుకోవడం కష్టమనే కామెంట్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి. కానీ వారికి మరో మంచి ఛాయిస్ కూడా ఉంది. ప్రస్తుతం బాబీ కొల్లి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవితో ‘కాకా’ అనే సినిమాను నిర్మిస్తున్నారు. గతంలో వీరి కాంబోలో వచ్చిన ‘వాల్తేరు వీరయ్య’ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.కాబట్టి, ‘కాకా’ గనక హిట్ అయితే కె.వి.ఎన్ ప్రొడక్షన్స్ మళ్లీ పుంజుకున్నట్టే. మరి ఏమవుతుందో చూడాలి!