గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఓ యంగ్ హీరోయిన్ బో*ల్డ్ వీడియో ఒకటి తెగ వైరల్ అవుతోంది. ఆమె తెలుగులో నటించిన చేసిన సినిమాలు చూసినవారికి ఆ వీడియో విషయంలో డౌట్ వస్తుంది. అయితే ఆ తర్వాత ఆమె సోషల్ మీడియా మేకోవర్ చూసినవారికి మాత్రం ఎలాంటి డౌట్ రాదు. కానీ మరీ ఇంతగా వీడియో చేస్తుందా అనే డౌట్ అయితే వస్తుంది. అలా డౌట్ పడినవారే కరెక్ట్. సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో తనదికాదు అని చెప్పేసింది షాలిని పాండే.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)తో రూపొందిస్తున్న డీప్‌ఫేక్ వీడియోలు కొన్ని నెలల వరకు అలారమింగ్‌గా ఉండేవి. ఈ మధ్య కాస్త తగ్గింది.. ఫేక్ వీడియోలు తగ్గుముఖం పట్టాయి అని అనుకుంటుంటగా షాలిని పాండే వీడియో ఒకటి బయటకు వచ్చింది. దీంతో ఆమె తన పేరుతో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న ఫేక్ వీడియో, ఫొటోలపై స్పందించింది. ఆ వీడియోలు ఏఐతో చేశారని క్లారిటీ ఇచ్చింది. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ పోస్టు పెట్టింది. టెక్నాలజీని ఇలా వాడటం సరికాదంటూ మండిపడింది.
టెక్నాలజీని మహిళలను కించపరిచేలా వాడటం దారుణం. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. దయచేసి ఆ వీడియోను ఎవరూ షేర్ చేయొద్దు, డౌన్‌లోడ్ చేయొద్దు. వెంటనే రిపోర్ట్ చేయండి అని శాలిని పాండే ఆ పోస్టులో పేర్కొంది. ఇక షాలిని పాండే కెరీర్ గురించి చూస్తే.. 2017లో విజయ్ దేవరకొండతో కలసి ‘అర్జున్ రెడ్డి’ సినిమా చేసింది. ఆ తర్వాత కీర్తి సురేశ్ ‘మహానటి’, నందమూరి బాలకృష్ణ ‘యన్టీఆర్: కథానాయకుడు’ (అతిథి పాత్ర), కల్యాణ్ రామ్ ‘118’, రాజ్ తరుణ్ ‘ఇద్దరి లోకం ఒక్కటే’, అనుష్క ‘నిశబ్దం’ సినిమాల్లో నటించింది.
ఆ సినిమా వచ్చి ఆరేళ్లు అవుతున్నా.. తెలుగులో మరో సినిమా చేయలేదు. అయితే తమిళం, హిందీలో సినిమాలో చేస్తోంది. తెలుగులో మళ్లీ ఎప్పుడు వస్తుందో చూడాలి.