Lakshmi Manchu: ఘనంగా మంచు లక్ష్మీ కూతురు నిర్వాణ 9వ బర్త్ డే సెలబ్రేషన్స్.. వైరల్ అవుతున్న ఫోటోలు !

మంచు లక్ష్మీ కూతురు యాపిల్ అలియాస్ విద్యా నిర్వాణ అందరికీ సుపరిచితమే. మంచు లక్ష్మీ నటిస్తున్న ‘అగ్ని నక్షత్రం’ సినిమాలోని ‘తెలుసా తెలుసా’ అనే పాటలో విద్యా నిర్వాణ డాన్స్ చేసిన వీడియో కూడా వైరల్ అయ్యింది. ఈ పాటలో మంచు లక్ష్మీ – విద్యా నిర్వాణ ఒకే స్క్రీన్ పై కనిపించడం హాట్ టాపిక్ అయ్యింది.ఆ తర్వాత మోహన్ బాబు పుట్టినరోజు నాడు యాపిల్ కి యాక్సిడెంట్ అయినట్టు కూడా తెలిపి అందరినీ షాక్ కు గురిచేసింది మంచు లక్ష్మీ.

ఇక ఈ జూన్ 15 న విద్యా నిర్వాణ పుట్టినరోజు కావడంతో.. మంచు లక్ష్మీ తన కూతురికి స్పెషల్ గా బర్త్ డే విషెస్ ను చెప్పింది. ఇది విద్యా నిర్వాణ 9వ పుట్టినరోజు కావడంతో గ్రాండ్ గా సెలబ్రేట్ చేసింది మంచు లక్ష్మీ. ఈ వేడుకలో మంచు లక్ష్మీ భర్త ఆండీ శ్రీనివాసన్ కూడా స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. ఇతను అమెరికాలో ఉంటున్నారు.కానీ ఫ్యామిలీ అకేషన్ కి తప్పకుండా హాజరవుతూనే ఉంటారు.

మంచు మనోజ్ రెండో పెళ్లికి కూడా ఆండీ శ్రీనివాసన్ హాజరయ్యాడు. సరోగసి ద్వారా (Lakshmi Manchu) మంచు లక్ష్మీ – ఆండీ.. విద్యా నిర్వాణకి జన్మనిచ్చారు. ఇక విద్యా నిర్వాణ 9 వ పుట్టినరోజు వేడుకలో మంచు మనోజ్ – భూమా మౌనిక దంపతులు కూడా హాజరయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియో , ఫొటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి. మీరు కూడా ఓ లుక్కేయండి

ఆదిపురుష్ సినిమా రివ్యూ & రేటింగ్!

‘సైతాన్’ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
కుటుంబం కోసం జీవితాన్ని త్యాగం చేసిన స్టార్ హీరోయిన్స్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus