Sarkaru Vaari Paata: ‘సర్కారు వారి పాట’ షూటింగ్ అప్డేట్!

  • June 19, 2021 / 04:33 PM IST

లాక్ డౌన్ కారణంగా సినిమా షూటింగులకు బ్రేక్ పడిన సంగతి తెలిసిందే. ఇప్పుడు పరిస్థితులు మెరుగుపడడంతో తిరిగి షూటింగ్ లను మొదలుపెడుతున్నారు. ఈ క్రమంలో సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా షూటింగ్ షురూ చేయాలని ఫిక్స్ అయ్యారు. వచ్చే నెల మొదటివారంలో ‘సర్కారు వారి పాట’ సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నారు మహేష్ బాబు. కరోనా సెకండ్ వేవ్ కారణంగా మూడు నెలలుగా ఇంట్లోనే ఉంటున్నారు మహేష్. ‘సర్కారు వారి పాట’కు సంబంధించిన కొంత భాగం అమెరికాలో చిత్రీకరించాల్సి ఉంది.

అయితే అమెరికాలో షూటింగ్ కి అనుకూలంగా లేదని.. ఐదు నెలల క్రితం దుబాయ్ లో ముప్పై రోజుల పాటు షూటింగ్ నిర్వహించారు. ఇప్పుడు వీసా దొరికి.. అన్నీ అనుకూలిస్తే అమెరికాలో చిన్న షెడ్యూల్ పూర్తి చేద్దామని అనుకుంటున్నారు. పరశురామ్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమాను మైత్రి మూవీస్ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. కీర్తి సురేష్ హీరోయిన్ గా కనిపించనుంది. ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేసి త్రివిక్రమ్ సినిమాను మొదలుపెట్టడానికి ప్లాన్ చేస్తున్నారు మహేష్ బాబు.

Most Recommended Video

బాలకృష్ణ మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్.. హిట్లే ఎక్కువ..!
సింహా టైటిల్ సెంటిమెంట్ బాలయ్యకి ఎన్ని సార్లు కలిసొచ్చిందో తెలుసా?
26 ఏళ్ళ ‘పెదరాయుడు’ గురించి ఈ 10 సంగతులు మీకు తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus