Lavanya Tripathi: వామ్మో లావణ్య త్రిపాఠి కట్టుకున్న చీర ధర తెలిస్తే మతిపోతోంది

మెగా హీరో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి గత కొన్నాళ్లుగా ప్రేమించుకొని ఇప్పుడు పెద్దల్ని ఒప్పించి జూన్ 9న వీరిద్దరూ నిశ్చితార్థం చేసుకున్నారు. వరుణ్ – లావణ్య నిశ్చితార్థం హైదరాబాద్ లోని వరుణ్ తేజ్ ఇంట్లోనే నిన్న శుక్రవారం సాయంత్రం ఘనంగా జరిగింది. వీరి నిశ్చితార్థం కేవలం మెగా, అల్లు ఫ్యామిలీలు, లావణ్య ఫ్యామిలీలు, అత్యంత సన్నిహితుల మధ్య మాత్రమే జరిగింది. వరుణ్ తేజ్, లావణ్య ఇద్దరూ తమ నిశ్చితార్థం ఫోటోలు నిన్న రాత్రే సోషల్ మీడియాలో షేర్ చేయగా అవి వైరల్ గా మారాయి.

తాజాగా వరుణ్ తేజ్ చెల్లి నిహారిక ఈ నిశ్చితార్థంలో వరుణ్ – లావణ్యతో కలిసి దిగిన రెండు ఫొటోలు షేర్ చేసి వెల్కమ్ వదిన అంటూ స్పెషల్ పోస్ట్ చేసింది. ఇక లావణ్యకు మెగా అభిమానులు మెగా కోడలు అంటూ స్వాగతం చెప్తున్నారు. ఈ సంవత్సరంలోనే వీరి వివాహం ఉండే ఛాన్స్ ఉంది. పలువురు అభిమానులు, సెలబ్రిటీలు వీరికి సోషల్ మీడియా వేదికగా కంగ్రాట్స్ చెప్తున్నారు. అయితే ఈ నిశ్చితార్థంలో లావణ్య కట్టిన చీర ధర ఇప్పుడు వైరల్ గా మారింది.

సాధారణంగానే సెలబ్రిటీలు ఎక్కువ ధర ఉన్న బ్రాండెడ్ బట్టలు వాడతారు. ఇక పెళ్లిళ్లు, ఫంక్షన్స్ కి అయితే మరింత కాస్ట్ లీ డ్రెస్ లు వేస్తారు. గతంలో చాలా మంది సెలబ్రిటీలు, హీరోయిన్స్ ఎక్కువ ధర ఉన్న బట్టలే వేసి వైరల్ గా మారారు. కొంతమంది అయితే లక్షల్లో విలువ చేసే చీరలు కట్టారు. ఇప్పుడు లావణ్య కట్టిన చీర ధర కూడా వైరల్ గా మారింది. వరుణ్ తో జరిగిన నిశ్చితార్థంలో లావణ్య కట్టిన చీర ధర ఏకంగా 75 వేల రూపాయలు.

ఈ చీరను లావణ్యకు (Lavanya Tripathi) అందించిన ఓ ఫ్యాషన్ డిజైనర్ తమ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. లైట్ గ్రీన్ కలర్ లో ఉన్న ఈ పట్టు చీర మెరిసిపోతుండగా లావణ్య ఇందులో మరింత అందంగా కనిపించింది. అయితే చాలా మంది హీరోయిన్స్ పెళ్లి చీరల ధరతో పోలిస్తే ఇది తక్కువే అని పలువురు కామెంట్స్ చేస్తున్నారు. నిశ్చితార్థానికి 75 వేల రూపాయల చీర కట్టింది అంటే పెళ్ళికి కచ్చితంగా లక్ష రూపాయలు దాటుతుంది అని మరి కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు.

టక్కర్ సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రేక్షకులను థియేటర్ కు రప్పించిన సినిమాలు ఇవే..!

అత్యధికంగా రెమ్యునరేషన్ తీసుకుంటున్న మ్యూజిక్ డైరెక్టర్లు వీళ్లేనా..!/a>
కలెక్షన్లలో దూసుకుపోతున్న లేడీ ఓరియంటల్ సినిమాలు ఇవే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus