మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నవంబర్ ఒకటవ తేదీ లావణ్య త్రిపాఠి మెడలో మూడు ముళ్ళు వేయనున్నారు. 31వ తేదీ నుంచి వీరి పెళ్లి వేడుకలు ప్రారంభం కానున్నాయని తెలుస్తుంది. నేడు వరుణ్ తేజ్ లావణ్య హల్దీ సంగీత్ కార్యక్రమాలతో ఈ పెళ్లి వేడుకలు ప్రారంభం కాబోతున్నాయని తెలుస్తుంది. ఇక నవంబర్ ఒకటవ తేదీ తెలుగు సాంప్రదాయం ప్రకారం వీరి వివాహం జరగబోతుంది. నవంబర్ ఒకటవ తేదీ ఇటలీలో వీరి పెళ్లి జరగబోతున్న నేపథ్యంలో ఇప్పటికే కుటుంబ సభ్యులందరూ కూడా ఇటలీ చేరుకున్నారు.
ఇక వీరు తమ ఇటలీ ఫోటోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ అభిమానులతో పంచుకుంటున్నారు. ఇకపోతే తాజాగా లావణ్య గురించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సెలబ్రిటీలు పెళ్లిళ్లు అంటే ప్రత్యేకంగా డిజైనర్ల చేత తమ దుస్తులను డిజైన్ చేయించుకొని చాలా గ్రాండ్ లుక్ లో కనిపించడానికి ఇష్టపడుతుంటారు. ఇక లావణ్య మాత్రం తన పెళ్లి విషయంలో నిహారిక బాటలోనే పయనిస్తుందని తెలుస్తుంది.
గతంలో నిహారిక తన పెళ్లి వేడుకలలో తన తల్లిగారు తన పెళ్లిలో కట్టుకున్న చీరను నిహారిక ధరించిన సంగతి మనకు తెలిసిందే. ఇప్పుడు లావణ్య కూడా అదే బాటలోనే తన తల్లి పెళ్లి చీరను తన పెళ్లిలో వేసుకోబోతున్నారని తెలుస్తోంది. లావణ్య (Lavanya Tripathi) పెళ్లిలో ధరించడానికి తన తల్లి చీరను కేప్ లెహంగాలో డిజైన్ చేయించారట.
ఇలా ఈ పెళ్లి వేడుకలలో ఈమె సంగీత్ కార్యక్రమానికి తన తల్లి చీరను డిజైన్ చేయించి వేసుకోబోతున్నారని తెలియడంతో నిహారిక బాటలోనే లావణ్య కూడా వెళ్తున్నారంటూ ఈ వార్త వైరల్ గా మారింది. మరో వైపు వరుణ్ కూడా హల్ది వేడుక కోసం మనీష్ మల్హోత్ర డిజైన్ చేసిన పసుపు రంగు కుర్తా ధరించబోతున్నారని తెలుస్తుంది. ఇక నేడు వీరి పెళ్లి వేడుకలు ప్రారంభం కాబోతున్నాయి.
‘పుష్ప’ టు ‘దేవర’.. 2 పార్టులుగా రాబోతున్న 10 సినిమాలు..!
‘సైందవ్’ తో పాటు టాలీవుడ్లో వచ్చిన ఫాదర్-డాటర్ సెంటిమెంట్ మూవీస్ లిస్ట్..!
ఆ హీరోయిన్స్ చేతిలో ఒక సినిమా కూడా లేదంట..!