Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

లెజెండరీ సింగర్ ఎస్ జానకి ఈరోజు కన్నుమూశారు. ఆమె మరణవార్త దేశవ్యాప్తంగా సంచలనమైంది. సుదీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ వస్తున్న ఆమె మైసూరులోని అపోలో హాస్పిటల్ లో చికిత్స పొందుతూ వచ్చారు. అయితే ఈరోజు ఆమెకు సడన్ గా గుండెపోటు రావడంతో హఠాన్మరణం చెందారు. ఎస్ జానకి వయస్సు 88 ఏళ్ళు. ఆమె మరణంతో భారతీయ సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది అని చెప్పాలి.

Legendary Singer S Janaki

1938 ఏప్రిల్ 23న ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరులో ఎస్ జానకి గారు జన్మించారు.ఆమెకు సంగీతం పై మక్కువ ఎక్కువ. చిన్ననాటి నుండే సంగీతంలో శిక్షణ పొందారు. ఎన్నో మ్యూజికల్ ఈవెంట్స్ లో పాల్గొని అవార్డులు, రివార్డులు పొందారు. ఆమె టాలెంట్ ను గుర్తించి సినిమాల్లో కూడా పాటలు పాడే అవకాశాలు కల్పించారు. ఆ విధంగా 1957లో వచ్చిన ‘విధియిన్ విలయట్టు’ అనే తమిళ సినిమాలో పాటలు పాడే అవకాశం పొందారు. దాదాపు 7 దశాబ్దాల సుదీర్ఘ కెరీర్‌లో ఆమె తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీతో సహా మొత్తంగా 20 భాషల్లో 48 వేలకు పైగా పాటలను ఆలపించి ప్రపంచ రికార్డుని సృష్టించారు.

‘సిరివెన్నెల’ ‘సాగర సంగమం’ వంటి ఎన్నో క్లాసిక్ సినిమాల్లో ఆమె పాడిన పాటలు ఇప్పటికీ లూప్ లో వినేలా ఉంటాయి. ‘శివరంజని నవ్వుల…’ ‘వెన్నెల్లో గోదారి అందం…’ ‘ప్రియతమా.. నను పలకరించు…’ వంటి ఎన్నో చార్ట్ బస్టర్స్ ఈమె ఖాతాలో ఉన్నాయి. ఆమె ఫిల్మ్ జర్నీలో మొత్తంగా 4 జాతీయ పురస్కారాలు, మరెన్నో రాష్ట్ర ప్రభుత్వ పురస్కారాలను పొందారు. అలాంటి గొప్ప గాయని ఈరోజు తిరిగిరాని లోకాలకి వెళ్ళిపోవడం అనేది నిజంగా యావత్ సినీపరిశ్రమకి తీరని లోటు అనే చెప్పాలి.

తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

 

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus