అక్కినేని అఖిల్ నుండి ఓ సినిమా వచ్చి ఆల్మోస్ట్ 3 ఏళ్ళు అవుతుంది. కొంత గ్యాప్ తీసుకుని అతను ‘లెనిన్’ (Lenin) చేశాడు. ‘వినరో భాగ్యము విష్ణుకథ’ వంటి డీసెంట్ హిట్ అందుకున్న మురళీ కిషోర్ అబ్బూరు ఈ చిత్రానికి దర్శకుడు. ‘సితార ఎంటర్టైన్మెంట్స్’ ‘అన్నపూర్ణ స్టూడియోస్’ సంస్థల పై సూర్యదేవర నాగవంశీ, నాగార్జున కలిసి ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. భాగ్య శ్రీ బోర్సే హీరోయిన్ గా నటించగా తమన్ సంగీతం అందించాడు.
ప్రమోషన్స్ లో భాగంగా విడుదల చేసిన.. పాటలు, టీజర్, ట్రైలర్ వంటివి పాజిటివిటీని క్రియేట్ చేశాయి. ఇక జూలై 10న రిలీజ్ అయిన ఈ సినిమా మొదటి రోజు మొదటి షోతోనే పాజిటివ్ టాక్ ను రాబట్టుకుంది. మ్యాట్నీల నుండి బుకింగ్స్ పెరిగాయి. ఈవినింగ్ అండ్ నైట్ షోలు కూడా బాగా కలెక్ట్ చేశాయి. ఒకసారి ఫస్ట్ డే కలెక్షన్స్ ను గమనిస్తే :
| నైజాం | 1.65 cr |
| సీడెడ్ | 0.65 cr |
| ఉత్తరాంధ్ర | 0.70 cr |
| ఈస్ట్ | 0.55 cr |
| వెస్ట్ | 0.40 cr |
| గుంటూరు | 0.65 cr |
| కృష్ణా | 0.38 cr |
| నెల్లూరు | 0.28 cr |
| ఏపీ + తెలంగాణ (టోటల్) | 5.26 cr (షేర్) |
| రెస్ట్ ఆఫ్ ఇండియా | 0.35 cr |
| ఓవర్సీస్ | 1.4 cr |
| వరల్డ్ వైడ్ (టోటల్) | 7.01 cr (షేర్) |
‘లెనిన్’ (Lenin) సినిమాకి ప్రపంచవ్యాప్తంగా రూ.19.2 కోట్ల ధియేట్రికల్ బిజినెస్ జరిగింది. బ్రేక్ ఈవెన్ కోసం రూ.20 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. మొదటి రోజు సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చింది. దీంతో మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. మొదటి రోజు రూ.7.01 కోట్ల షేర్ ను రాబట్టింది ఈ సినిమా. గ్రాస్ పరంగా రూ.13.6 కోట్ల వరకు కలెక్ట్ చేసింది. బ్రేక్ ఈవెన్ కోసం రూ.12.99 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది.