అక్కినేని అఖిల్ నుండి ఓ సినిమా వచ్చి ఆల్మోస్ట్ 3 ఏళ్ళు అవుతుంది. కొంత గ్యాప్ తీసుకుని అతను ‘లెనిన్'(Lenin) చేశాడు. ‘వినరో భాగ్యము విష్ణుకథ’ వంటి డీసెంట్ హిట్ అందుకున్న మురళీ కిషోర్ అబ్బూరు ఈ చిత్రానికి దర్శకుడు. ‘సితార ఎంటర్టైన్మెంట్స్’ ‘అన్నపూర్ణ స్టూడియోస్’ సంస్థల పై సూర్యదేవర నాగవంశీ, నాగార్జున కలిసి ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. భాగ్య శ్రీ బోర్సే హీరోయిన్ గా నటించగా తమన్ సంగీతం అందించాడు.
ప్రమోషన్స్ లో భాగంగా విడుదల చేసిన.. పాటలు, టీజర్, ట్రైలర్. ‘చికిరి చికిరి’ పాట అయితే యూట్యూబ్లో వందల కొద్దీ మిలియన్ల వ్యూస్ ను కొల్లగొట్టింది. ట్రైలర్ కూడా మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. అందుకే ఈ సినిమాకి భారీ ధియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఒకసారి వాటి వివరాలు అలాగే బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్ ను ఓ లుక్కేద్దాం రండి :
| నైజాం | 7 cr |
| సీడెడ్ | 2 cr |
| ఉత్తరాంధ్ర | 2 cr |
| ఈస్ట్ | 0.60 cr |
| వెస్ట్ | 0.50 cr |
| గుంటూరు | 1.2 cr |
| కృష్ణా | 1 cr |
| నెల్లూరు | 0.40 cr |
| ఏపీ + తెలంగాణ (టోటల్) | 14.7 cr |
| రెస్ట్ ఆఫ్ ఇండియా | 1.5 cr |
| ఓవర్సీస్ | 3 cr |
| వరల్డ్ వైడ్ (టోటల్) | 19.2 cr |
‘లెనిన్’ సినిమాకి ప్రపంచవ్యాప్తంగా రూ.19.2 కోట్ల ధియేట్రికల్ బిజినెస్ జరిగింది. బ్రేక్ ఈవెన్ కోసం రూ.20 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. పాజిటివ్ టాక్ కనుక వస్తే.. సోలో రిలీజ్ అడ్వాంటేజ్ తో టార్గెట్ రీచ్ అయ్యే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. చూడాలి మరి ఏమవుతుందో..!