‘ఏజెంట్’ తర్వాత దాదాపు 3 ఏళ్ళు గ్యాప్ తీసుకుని అఖిల్ చేసిన సినిమా ‘లెనిన్'(Lenin). నాగార్జునతో కలిసి ‘సితార’ నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మించాడు. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్. తమన్ సంగీతం అందించాడు. జూలై 10న ‘లెనిన్’ విడుదల కానుంది.ప్రమోషన్స్ లో భాగంగా విడుదల చేసిన పాటలు ప్రేక్షకుల నుండి మంచి మార్కులు వేయించుకున్నాయి. తాజాగా ట్రైలర్ ను కూడా వదిలారు.
‘లెనిన్’ ట్రైలర్ 3 నిమిషాల 9 సెకన్ల నిడివి కలిగి ఉంది. నాగార్జున వాయిస్ ఓవర్ తో ట్రైలర్ మొదలైంది. ‘ఇది మహాభారతం’ అంటూ ‘లెనిన్’ ప్రపంచంలోకి తీసుకెళ్ళాడు నాగ్. చిత్తూరు జిల్లాలో ప్రతి సంవత్సరం 18 రోజుల పాటు ద్రౌపది అమ్మని కొలుస్తారని, ఆ 18 రోజులు భూమి మీద రక్తం చిందించకుండా నిష్టగా జాతర జరుపుతారని వివరించాడు. ఆ తర్వాత జాతర్లో హీరో అఖిల్ తలపై గాయం అయితే.. రక్తం హీరోయిన్ నుదుటిపై బొట్టుగా మారే విజువల్ ఆకట్టుకుంటుంది.
అటు తర్వాత హీరో, హీరోయిన్ మధ్య లవ్ ట్రాక్ ను చూపించారు. ఆ తర్వాత ధర్మరాజు గా వసంత్ అనే పాత్రని చూపించారు. అతను హీరో స్నేహితుడు. కథని ముందుకు తీసుకెళ్ళే పాత్ర అది అని అర్దం చేసుకోవచ్చు. తర్వాత వసంత్ కి విలన్ నుండి ఎలాంటి సమస్యలు వచ్చాయి. వాటిని హీరో ఎలా సాల్వ్ చేశాడు. కురుక్షేత్రంలో చివరి ఘట్టం అంటూ హీరో విశ్వరూపాన్ని ఎలా చూపించారు అనేది మిగిలిన కథగా తెలుస్తోంది.
ట్రైలర్లో పూర్తిగా కథపైనే హింట్ ఇచ్చారు. అనవసరమైన ఎలివేషన్స్ జోలికి పోలేదు. దాదాపు అన్ని పాత్రలని పరిచయం చేశారు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. లాస్ట్ షాట్లో అఖిల్ చెప్పే డైలాగ్, అతని మేనరిజమ్స్ కూడా సెట్ అయ్యాయి. అలాగే అఖిల్ లుక్ కూడా మాస్ ఆడియన్స్ ని ఆకట్టుకునే విధంగా డిజైన్ చేశారు. ట్రైలర్ అయితే బాగానే ఉంది. మీరు కూడా ఓ లుక్కేయండి :