Parasakthi: రూ.8.39 కోట్లు ఎగ్గొట్టారు.. కోర్టుకెక్కిన డైరెక్టర్ సుధా కొంగర

శివ కార్తికేయన్‌, దర్శకురాలు సుధా కొంగర కాంబినేషన్లో ‘పరాశక్తి'(Parasakthi) అనే సినిమా రూపొందింది. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన ఈ పీరియడ్ మూవీ బాక్సాఫీస్ దగ్గర మిశ్రమ ఫలితాన్ని అందుకుంది. క్రేజీ కాంబినేషన్లో వచ్చిన సినిమా కావడం, రిలీజ్ కి ముందు కొంత హైప్ ఏర్పడటంతో టాక్ తో సంబంధం లేకుండా మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. కానీ తర్వాత కంటెంట్ వల్ల సినిమా లాంగ్ రన్లో నిలదొక్కుకోలేకపోయింది.

Parasakthi

అల్మోస్ట్ జనాలంతా ఈ సినిమాని మర్చిపోయారు అనుకున్న టైమ్లో దర్శకురాలు సుధా కొంగర.. మళ్ళీ వార్తల్లో నిలపడం జరిగింది. ‘పరాశక్తి’ విషయంలో హైకోర్టును ఆశ్రయించి సినీ వర్గాల్లో పెద్ద చర్చలకు దారితీసింది సుధ కొంగర. విషయం ఏంటంటే… సుధా కొంగరకు ఈ చిత్రానికి గాను రూ.15 కోట్ల పారితోషికం ఆఫర్ చేశారట. ఆ మాటపైనే అగ్రిమెంట్ కూడా చేసుకున్నారట. జీఎస్టీతో కూడా కలుపుకొని ఆమెకు మొత్తంగా రూ.17.70 కోట్ల పారితోషికం ఇచ్చేలా అగ్రిమెంట్ చేసుకున్నారట.

కానీ నిర్మాతలు ఆమెకు పూర్తి పారితోషికం చెల్లించలేదట. కేవలం రూ.9.31 కోట్లు మాత్రమే చెల్లించారని, మిగతా రూ.8.39 కోట్లు చెల్లించలేదని సుధా.. మద్రాస్ హైకోర్టుని ఆశ్రయించారు. తన బ్యాలెన్స్ అమౌంట్ చెల్లించే వరకు నిర్మాతల నెక్స్ట్ మూవీ ‘ఇదయం మురళి’ విడుదలను నిలిపివేయాలని ఆమె పిటిషన్లో పేర్కొంది.‘ఇదయమ్ మురళి’ సినిమాని జూలై 10న విడుదల చేస్తున్నట్టు నిర్మాతలైన ‘డాన్ పిక్చర్స్’ వారు ప్రకటించారు.

రిలీజ్ దగ్గర పడుతున్న నేపధ్యంలో నిర్మాతలకి సుధ కొంగర షాక్ ఇచ్చింది. ఈ క్రమంలో సుధ కొంగర పిటిషన్ ను స్వీకరించిన హైకోర్టు.. ఆ సినిమా విడుదలపై మాత్రమే కాకుండా ‘పరాశక్తి’ చిత్రం శాటిలైట్ టెలికాస్ట్ ను జూలై 8 వరకు నిలిపివేయాలని ఆదేశించింది.

ముందు అనిరుథ్ పేరు వేసి.. తర్వాత తమన్ ని పట్టుకొస్తారా?

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus