Prabhas: సలార్ లో ప్రభాస్ కు తక్కువ డైలాగ్స్.. ఆమె రెస్పాన్స్ ఇదే!

స్టార్ హీరో ప్రభాస్ నటించిన సలార్ మూవీ నెట్ ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగుతో పాటు ఇతర భాషల్లో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ఈ సినిమాలో ప్రభాస్ మాట్లాడిన షాట్స్ మొత్తం కలిపితే కేవలం నాలుగు నిమిషాలు మాత్రమేనని కొన్ని వీడియోలు సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతున్నాయి. ప్రశాంత్ నీల్ భార్య లిఖితారెడ్డికి సైతం ఇందుకు సంబంధించిన ప్రశ్నలు ఎదురయ్యాయి. ఆ కామెంట్ల గురించి లిఖితారెడ్డి రియాక్ట్ అవుతూ ప్రభాస్ కటౌట్ తాలూకు నీడనే మిలియన్ డైలాగ్స్ కు సమానమని తనకు డైలాగ్స్ ఉండాల్సిన పని లేదని ఆమె చెప్పుకొచ్చారు.

లిఖితారెడ్డి నీల్ చెప్పిన విషయాలు కరెక్టేనని ప్రభాస్ ఫ్యాన్స్ సైతం చెబుతున్నారు. అయితే సలార్2 లో మాత్రం ప్రభాస్ కు ఎక్కువగానే డైలాగ్స్ ఉంటాయని సమాచారం అందుతోంది. త్వరలో సలార్2 మూవీ రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. ప్రభాస్ ఫ్యాన్స్ సలార్2 కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సలార్1 లో ఎన్నో ప్రశ్నలకు జవాబు దొరకలేదని సలార్2 లో ఆ ప్రశ్నలకు సమాధానం దొరుకుతుందని ప్రభాస్ అభిమానులు భావిస్తున్నారు.

సలార్2 స్క్రిప్ట్ ఎప్పుడో పూర్తి కావడంతో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్తే తక్కువ సమయంలోనే షూటింగ్ ను పూర్తి చేసుకునే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పవచ్చు. సలార్2 బడ్జెట్ లెక్కలు సైతం భారీగా ఉండబోతున్నాయని తెలుస్తోంది. సలార్2 సినిమాలో వార్ సీన్స్ కూడా ఉంటాయని ప్రచారం జరుగుతోంది.

ప్రభాస్ (Prabhas) పాత్రకు సంబంధించి సినిమాలో షాకింగ్ ట్విస్టులు ఉండబోతున్నాయని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. సలార్2 సినిమాలో శృతి హాసన్ పాత్రకు కూడా ప్రాధాన్యత ఉండనుందని సమాచారం అందుతోంది. సలార్2 మూవీ ఏ రేంజ్ లో బాక్సాఫీస్ ను షేక్ చేయనుందో చూడాల్సి ఉంది. సలార్2 సినిమాపై అంచనాలు ఊహించని రేంజ్ లో పెరుగుతున్నాయి.

‘గుంటూరు కారం’ లో ఆకట్టుకునే డైలాగులు ఇవే.!

‘గుంటూరు కారం’ తో పాటు సంక్రాంతి సీజన్ వల్ల సేఫ్ అయిన 10 సినిమాల లిస్ట్.!
2023లో అభినయంతో ఆకట్టుకున్న అందాల భామలు.!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus