ఓ సినిమా గురించి టీమ్ నుండి క్లారిటీ వస్తే.. ఆ సినిమా హీరో, హీరోయిన్, దర్శకుడి ఫ్యాన్స్ హ్యాపీ ఫీలవుతారు. అందులో తప్పులేదు కూడా. అయితే ఒక హీరో సినిమా అప్డేట్ వస్తే… మరో హీరో ఫ్యాన్స్ హ్యాపీ ఫీలవుతున్నారు. అంతేకాదు ‘హమ్మయ్య’ అంటూ ఊపిరి పీల్చుకుంటున్నారు కూడా. ఈ పాటికే మీకు అర్థమై పోయుంటుంది మేం చెబుతున్నది ‘ఇండియన్ 2’, ‘ గేమ్ ఛేంజర్’ గురించి అని. అవును ఈ సినిమాల గురించే ఇప్పుడు చర్చ.
ఎప్పుడో ప్రారంభించిన కమల్ హాసన్ ‘ఇండియన్ 2’ను పక్కనపెట్టేసి రామ్‌చరణ్ – దిల్ రాజు ‘గేమ్ ఛేంజర్’ను మొదలుపెట్టారు దర్శకుడు శంకర్. అయితే అనూహ్యంగా ఆ సినిమా మళ్లీ ముందుకొచ్చింది. దీంతో ఆయన రెండు సినిమాలు బ్యాలన్స్ చేసే ప్రయత్నం చేశారు. కానీ వర్కవుట్ కాలేదు. దీంతో ‘ఇండియన్ 2’ సినిమాను తొలుత పూర్తి చేసేద్దాం అనుకున్నారు. అనుకున్నట్లే ఆ సినిమా రెగ్యులర్ షూటింగ్‌ను స్పీడప్ చేసి సినిమాను ఆఖరికి తీసుకొచ్చారు. అయితే విడుదల విషయంలో తాజాగా క్లారిటీ వచ్చింది.
‘ఇండియన్ 2’ సినిమా పూర్తిగా షూటింగ్ కంప్లీట్ అవ్వలేదు కానీ.. మేజర్ పార్ట్ మొత్తం తీసేశారు అని అంటున్నారు. మరోవైపు పోస్ట్‌ప్రొడక్షన్ కూడా స్పీడప్ చేస్తున్నారు. అలా ఈ సినిమాను వచ్చే ఏడాది ఆగస్టు 15కు విడుదల చేయాలని అనుకుంటున్నారు. ఏంటీ మరో 11 నెలల తర్వాతనా అనే డౌట్ పడుతున్నారా? పడుతుంది ఎందుకంటే అది శంకర్ సినిమా. విజువల్ ఎఫెక్ట్స్ విషయంలో చాలా సమయం పడుతుంది అని అంటున్నారు. దీంతో త్వరలోనే ‘గేమ్ ఛేంజర్’ సినిమా షురూ అవుతుంది అని టాక్.
అలాగే మరో విషయంలో కూడా క్లారిటీ వచ్చేసింది. ‘ఇండియన్ 2’ ఆగస్టులో వస్తే… (Ram Charan) చరణ్ ‘గేమ్ ఛేంజర్’ను సమ్మర్లో తీసుకొచ్చేయొచ్చు. దానికి తగ్గట్టుగా సినిమా పనులు వేగవంతం చేయాలని టీమ్ అనుకుంటోందట. త్వరలోనే షూటింగ్ ఫుల్ స్వింగ్‌లో ప్రారంభిస్తారు అని చెబుతున్నారు.
జవాన్ సినిమా రివ్యూ & రేటింగ్!
మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 7’ 14 మంది కంటెస్టెంట్స్ పారితోషికాల లిస్ట్..!