Little Hearts Collections: బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘లిటిల్ హార్ట్స్’

Advertisement

సోషల్ మీడియా సెన్సేషన్ మౌళి హీరోగా మారి ‘లిటిల్ హార్ట్స్'(Little Hearts) అనే సినిమా చేసిన సంగతి తెలిసిందే.2025 సెప్టెంబర్ 5న రిలీజ్ అయ్యింది ఈ సినిమా. చిన్న సినిమాగా రూపొందినప్పటికీ పాజిటివ్ టాక్ తెచ్చుకుని బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించింది ఈ చిత్రం.

Little Hearts Collections

వంశీ నందిపాటి, బన్నీ వాస్ సమర్పణలో ‘ఈటీవీ విన్’ అధినేతలు అయిన నితిన్, సాయి, 90’s దర్శకుడు ఆదిత్య హాసన్ కలిసి నిర్మించిన సినిమా ఇది. వాళ్ళ బ్యాకప్ వల్ల ఈ ప్రాజెక్టుకి మరింత క్రేజ్ ఏర్పడింది.

సాయి మార్తాండ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా మల్టీప్లెక్సుల్లో మాత్రమే కాదు సింగిల్ స్క్రీన్స్ లో కూడా మంచి వసూళ్లు సాధించింది. సినిమా కొనుగోలు చేసిన బయ్యర్స్ అంతా మంచి లాభాలు ఆర్జించారు. క్లోజింగ్ కలెక్షన్స్ ను ఓ లుక్కేద్దాం రండి :

 

నైజాం 6 cr
సీడెడ్ 1.2 cr
ఆంధ్ర(టోటల్) 5.8 cr
ఏపీ + తెలంగాణ(టోటల్) 12 cr (షేర్)
రెస్ట్ ఆఫ్ ఇండియా 1.8 cr
ఓవర్సీస్ 2.8 cr
వరల్డ్ వైడ్ (టోటల్) 16.6 cr (షేర్)

‘లిటిల్ హార్ట్స్’ సినిమాకు రూ.1.5 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కోసం రూ.2 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది.ఫుల్ రన్ ముగిసేసరికి ఈ సినిమా ఏకంగా రూ.16.6 కోట్ల షేర్ ను కలెక్ట్ చేసింది. గ్రాస్ పరంగా రూ.30 కోట్లు పైనే వసూల్ చేసింది అని చెప్పాలి. 2025 లో రిలీజ్ అయిన సినిమాల్లో బాక్సాఫీస్ వద్ద అత్యధిక లాభాలు అంధించిన సినిమాల్లో ‘లిటిల్ హార్ట్స్’ కూడా ఒకటి కావడం విశేషం.

‘జెట్లీ’ ఆపేశారు.. మరి ‘పెద్ది’ పరిస్థితి ఏంటి?

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus