Jetlee – Peddi: అక్కడ ‘జెట్లీ’ ఆపేశారు.. మరి ‘పెద్ది’ పరిస్థితి ఏంటి?

Advertisement

చిన్న సినిమా కాబట్టి చాలామందికి తెలియలేదు కానీ.. పెద్ద హీరో సినమా అయితే ఈ పాటికి నానా రచ్చ అయిపోయేది. ఇటీవల విడుదలైన కమెడియన్‌ సత్య – రితేశ్‌ రాణా సినిమా ‘జెట్లీ’ గురించే ఇదంతా. మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యాక్‌ ఎండ్‌లో ఉంటూ నిర్మించిన ఈ సినిమా తెలంగాణలో అన్ని థియేటర్లలో విడుదల అవ్వలేదు. పక్కాగా చెప్పాలంటే శుక్రవారం విడుదలైన ‘జెట్లీ’ సినిమాను మల్టీప్లెక్స్‌లు నిషేధించాయి. ఈ విషయమై మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్‌ ఎల్‌ఎల్‌పీ అభ్యంతరం వ్యక్తం చేసింది.

Jetlee – Peddi

ఈ విషయంలో ఎగ్జిబిటర్ల తీరు సరికాదంటూ మైత్రీ సంస్థ తరఫున డిస్ట్రిబ్యూటర్‌ శశిధర్‌ ఓ నోట్‌ కూడా విడుదల చేశారు. సింగిల్‌ స్క్రీన్స్‌లో గొడవ ఉంటే దాన్ని అక్కడే తేల్చుకోవాలి కానీ, మల్టీప్లెక్స్‌ స్క్రీన్లను అడ్డుపెట్టుకుని ఇలా ఒత్తిడి తీసుకురావడం సరికాదని ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో మరో ప్రశ్న మొదలైంది. అదే వచ్చే నెలలో విడుదలకు సిద్ధమవుతున్న ‘పెద్ది’ సినిమా గురించే. ఎందుకంటే ఆ సినిమా తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేసేది మైత్రీ మూవీ మేకర్స్‌. దీంతో ఆ సినిమా విషయంలో కూడా ఇలానే చేస్తే ఏంటి అనేది ప్రశ్న.

ఈ విషయంలో మైత్రీ మూవీ మేకర్స్‌ సీఈవో, ‘జెట్లీ’ నిర్మాత మీడియాతో మాట్లాడుతూ థియేటర్ల వ్యవహారం గురించి మాట్లాడారు. నిర్మాతలు, ఎగ్జిబిటర్ల మధ్య భేదాభిప్రాయాలు ఉన్న విషయం అందరికీ తెలిసిందే. పర్సంటేజీ విధానంలో సినిమా ప్రదర్శనలు ఉండాలని సింగిల్‌ స్క్రీన్‌ థియేటర్ల యాజమాన్యాలు డిమాండ్‌ చేస్తున్నాయి. వాళ్లు అడిగినట్లు చేస్తే తమకు ఇబ్బందని నిర్మాతలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో మే 1 నుండి పర్సంటేజీ పద్ధతి అయితేనే థియేటర్లు ఇస్తామని ఎగ్జిబిటర్లు నిర్ణయం తీసుకున్నారు అని చెప్పారు చెర్రీ.

ఈ విషయమై చర్చించాలని ఫిల్మ్‌ ఛాంబర్‌ ప్లాన్‌ చేసినా కుదర్లేదు. ఈ విషయంలో మే 8న కీలక సమావేశం జరుగుతుంది. అప్పుడు ఈ విషయంలో పరిష్కారం దొరుకుతుందని ఆశించొచ్చు. లేదంటే ‘పెద్ది’ సినిమా ఇబ్బందిపడక తప్పదు. అయితే రామ్‌చరణ్‌ సినిమా విషయంలో థియేటర్ల యాజమాన్యాలు, ఎగ్జిబిటర్లు ఇలా నిలిపేసే పనులు చేస్తారా అనేది డౌటే.

ఆస్కార్స్‌ రూల్స్‌లో కీలక మార్పు .. ఇకపై వారికి మరిన్ని అవకాశాలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus