శంకర్, కమల్ హాసన్ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న ‘ఇండియన్ 2’ వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ సినిమా షూటింగ్ పూర్తి చేయకుండా శంకర్ వేరే ప్రాజెక్ట్ లను తెరకెక్కించడానికి వీల్లేదంటూ లైకా నిర్మాణ సంస్థ కోర్టుని ఆశ్రయించిన సంగతి తెలిసిందే. అయితే సినిమా ఆలస్యం కావడంలో తన తప్పు లేదని.. లైకా, కమల్ హాసన్ లే దానికి కారణమంటూ శంకర్ కౌంటర్ పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే.
ఈ సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలని కోర్టు సూచింది. ఈ కేసును జూన్ 4కి వాయిదా వేసింది. ఈ క్రమంలో లైకా ప్రొడక్షన్స్ మరో అడుగు ముందుకేసి ‘ఇండియన్ 2’ సినిమా పూర్తి చేసే వరకు శంకర్ మరో కొత్త సినిమా మొదలుపెట్టకుండా చూడాలంటూ టాలీవుడ్, బాలీవుడ్ ఫిల్మ్ ఛాంబర్స్ కు లెటర్ రాసినట్లు తెలుస్తోంది. ఈ లేఖలో శంకర్ కు వ్యతిరేకంగా కొన్ని పాయింట్స్ జోడించినట్లు తెలుస్తోంది.
ఇటీవలే శంకర్.. రామ్ చరణ్ హీరోగా ఓ పాన్ ఇండియా ప్రాజెక్ట్ అనౌన్స్ చేశారు. దిల్ రాజు ఈ సినిమాను నిర్మించడానికి రెడీ అయ్యారు. ఇప్పుడు లైకా లెటర్ కారణంగా ఈ ప్రాజెక్ట్ మరింత ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోపక్క హిందీలో ‘అపరిచితుడు’ రీమేకు ను రణవీర్ హీరోగా తెరకెక్కించాలని శంకర్ ప్లాన్ చేశాడు. చరణ్ తో ప్రాజెక్ట్ పూర్తయిన తరువాత ఈ రీమేక్ మొదలుపెట్టాలని భావించాడు. కానీ ఇప్పుడు ఈ రెండు సినిమాలను కొంతకాలం పాటు హోల్డ్ లో పెట్టక తప్పేలా లేదు!
Most Recommended Video
థ్యాంక్యూ బ్రదర్ సినిమా రివ్యూ & రేటింగ్!
వెంకీ టు సాయి తేజ్.. అందరూ అలా కష్టపడినవాళ్ళే..!
ఈ 12 మంది హీరోయిన్లు తక్కువ వయసులోనే పెళ్లి చేసుకున్నారు..!