Maa Inti Bangaaram Collections: మొదటి వీకెండ్..కే 40 శాతం పైగా లాభాలతో ‘మా ఇంటి బంగారం’ సెన్సేషన్

‘ఖుషి’ తర్వాత సమంత ఫుల్ లెంగ్త్ లీడ్ రోల్ చేసిన సినిమా ఏమీ రాలేదు. ‘శుభం’ లో కెమియో ఇచ్చింది. కానీ దాంతో అభిమానులు సంతృప్తి చెందలేదు. మొత్తానికి 3 ఏళ్ళ గ్యాప్ తర్వాత ‘మా ఇంటి బంగారం’తో(Maa Inti Bangaaram) ప్రేక్షకుల ముందుకు రాబోతోంది సమంత. ఆమె స్నేహితురాలు నందినీ రెడ్డి దర్శకత్వం వహించిన సినిమా ఇది. గతంలో వీరి కాంబినేషన్లో ‘ఓ బేబీ’ అనే హిట్ సినిమా వచ్చింది. దీంతో ‘మా ఇంటి బంగారం’ పై మొదటి నుండి మంచి అంచనాలు ఏర్పడ్డాయి.

Maa Inti Bangaaram

టీజర్, ట్రైలర్స్ అనేవి టార్గెటెడ్ ఆడియన్స్ కు నచ్చాయి. జూన్ 19న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మొదటి షోతోనే పాజిటివ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. దీంతో మొదటి రోజు వసూళ్ళు చాలా బాగా వచ్చాయి. రెండో రోజుకే బ్రేక్ ఈవెన్ సాధించింది. 3వ రోజు కూడా వసూళ్లు అదిరిపోయాయి. ఒకసారి ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ ను గమనిస్తే :

నైజాం 5.05 cr
సీడెడ్ 0.50 cr
ఆంధ్ర(టోటల్) 3.64 cr
ఏపీ +తెలంగాణ(టోటల్) 9.19 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా + తమిళనాడు 2.58 cr
 ఓవర్సీస్ 6.28 cr
వరల్డ్ వైడ్ టోటల్ 18.05 cr (షేర్)

‘మా ఇంటి బంగారం’ సినిమాకి వరల్డ్ వైడ్ గా  రూ.9 కోట్ల  ధియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కోసం  అల్మోస్ట్ రూ.10 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించిన ఈ సినిమా ఫస్ట్ వీకెండ్ ముగిసేసరికి వరల్డ్ వైడ్ గా రూ.18.05 కోట్ల షేర్ ను రాబట్టింది. గ్రాస్ పరంగా రూ.34.7 కోట్లు కలెక్ట్ చేసింది. ఇప్పటివరకు ‘మా ఇంటి బంగారం’ సినిమా రూ.8.05 కోట్ల లాభాలను బయ్యర్స్ కి అందించింది.

‘దీవానా’…సక్సెస్ మీట్ అంటే ఇలానా?

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus