ఫ్యామిలీ, సోషల్, యాక్షన్, రొమాన్స్, మైథలాజికల్ టచ్ ఇస్తూ అనుముల ప్రొడక్షన్స్ బ్యానర్ మీద అనుముల లక్ష్మణరావు, పల్లకొండ శ్రీరాములు నిర్మిస్తున్న చిత్రం ‘మా రాముడు అందరివాడు’(Maa Ramudu Andarivadu). ఈ సినిమాకి యద్దనపూడి మైకిల్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం అని కార్యక్రమాలు పూర్తి చేసుకుని సెప్టెంబర్ 4న విడుదలకు సిద్ధంగా ఉంది. రెండు గంటల రెండు నిమిషాల ముప్పై సెకన్ల నిడివితో ఈ సినిమా రాబోతోంది.
ఈ కలియుగంలోనూ హనుమంతుడు మానవ జాతికి దిశా నిర్దేశం చేస్తుంటారు. ప్రకృతి అనే అమ్మాయికి హనుమాన్ ఎన్నెన్నో కథలు చెబుతుంటారు. అందులో భాగంగానే రాముడు కథను చెప్తారు. సొంత ఊరిని వదిలేసి రాముడు అడవుల్లోకి జీవనం కొనసాగిస్తుంటారు. ఊర్లో హాస్పిటల్ కట్టించాలని రాముడి తండ్రి జీవితాంతం పోరాడుతూనే ఉంటాడు. ఇక రాముడు తన తండ్రి ఆశయాన్ని గుర్తించి, తన తప్పుని తెలుసుకుని ఊరికి తిరిగి వస్తాడు.
ఊరికి తిరిగి వచ్చిన రాముడు చేసిన పనులు ఏంటి? ఊర్లోని చెడుని ఎలా నిర్మూలించాడు? ఊరిని ఎలా తీర్చిదిద్దాడు? అన్నదే కథ. రామాయణ గాథను హనుమంతుడు చెప్పే సీన్లు, అక్కడ వాడే సీజీ అద్భుతంగా ఉంటుంది. ప్రకృతి వర ప్రసాదమైన ఓ బిడ్డకు ఈ కథను హనుమంతుడు వివరిస్తుంటాడు. ఇందులో హనుమంతుడి పాత్రకు గానూ తణికెళ్ల భరణి వాయిస్ ఓవర్ ఇచ్చారు. ఆయన గంభీరమైన గాత్రం ప్రేక్షకుల్ని కట్టి పడేస్తుంది.
ఈ చిత్రంలో శ్రీరాములు, స్వాతి మందాడి, అనుముల లక్ష్మణరావు, సుమన్, బాహుబలి ప్రభాకర్, నాగ మహేష్, అప్పారావు, సమ్మెట గాంధీ, గడ్డం నవీన్, ఆనంద్ భారతి, చిట్టి బాబు, గోల్డ్ రెడ్డి, బేబీ గనిష్క రంద్రంక్షి ముఖ్య పాత్రల్ని పోషించారు.ఈ సినిమాకి మనీష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. బొల్ల వెంకటేష్ బీజీఎం సమకూర్చారు. ఈ మూవీలో మొత్తం ఐదు పాటలు ఉంటాయి. నజీర్ ఉద్దిన్, గీతా మాధురి, రమ్య బెహరా, నల్గొండ గద్దర్, మనీష్ కుమార్ ఈ పాటల్ని ఆలపించారు.మున్ముందు మరిన్ని అప్డేట్‌లతో చిత్రయూనిట్ ప్రేక్షకుల ముందుకు రానుంది.