Mahesh, Namrata: గౌతమ్‌ స్టేజీ షో… ఎంజాయ్‌ చేసిన ఫ్యామిలీ మెంబర్స్‌.. ఎక్కడంటే?

  • June 24, 2024 / 05:27 PM IST

సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబు (Mahesh Babu) వారసుడు గౌతమ్‌ వారసత్వం తీసుకుంటాడా లేదా? అనే ప్రశ్న అస్సలు అక్కర్లేదు. అయితే ఎప్పుడు సినిమాల్లోకి వస్తాడు? అనేదే ప్రశ్న. ఎందుకంటే ఇప్పటికే బాలనటుడిగా గౌతమ్‌ సినిమాలో నటించి మెప్పించాడు కూడా. ఇప్పుడు నటుడిగా రంగస్థలం మీద కూడా తన నటనా కౌశలాన్ని చూపించి మెప్పించాడు. గౌతమ్ ఘట్టమనేని ఫస్ట్ థియేటర్ స్టేజ్ షో ఇటీవల జరిగింది. దీనికి సంబంధించిన ఫొటోలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

మహేష్ బాబు, నమ్రత (Namrata) ప్రస్తుతం లండన్‌లో ఉన్నారు. గౌతమ్ మొట్ట మొదటి థియేటర్ స్టేజ్ షో కోసం కుటుంబం మొత్తం లండన్‌ వెళ్లింది. ఈ సందర్భంగా గౌతమ్‌ మొదటి స్టేజీ షో ఆనందంగా గడిచింది అని నమ్రత ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు. ఈ మేరకు కొన్ని ఫొటోలు కూడా షేర్‌ చేశారు. గౌతమ్‌ తన నటనతో అందరినీ ఆకట్టుకున్నాడని ప్రశంసలు కూడా కురిపించారు. చిన్నారుల్లోని ప్రతిభను వెలికితీసేలా ‘జాయ్‌ ఆఫ్‌ డ్రామా’ ఏటా సమ్మర్‌ ప్రోగ్రామ్‌ నిర్వహిస్తూ ఉంటుంది.

గౌతమ్‌ కూడా అందులోనే తన ప్రదర్శన ఇచ్చాడు. మహేశ్‌ బాబు, సితార, నమ్రత సోదరి శిల్పా శిరోద్కర్‌ తదితరులు ఈ షోకి హాజరయ్యారు. స్నేహితులు, కుటుంబంతో కలసి ఇక్కడకు రావడం, స్టేజీ షోను చూసి ఎంజాయ్‌ చేయడం ఎంతో ఉత్సాహాన్ని ఇస్తోంది అని నమ్రత తన పోస్టులో పేర్కొన్నారు. గౌతమ్‌ ఇటీవల గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడే సినిమాల్లోకి వచ్చే పరిస్థితి అయితే లేదు. చదువు పూర్తయ్యాకే సినిమాల్లోకి వస్తాడంటున్నారు. అన్నట్లు గౌతమ్‌ వేసి స్టేజీ షో పేరు చెప్పలేదు కదా ‘రోమియో జూలియెట్‌ అండ్‌ ఎట్‌సెట్రా’.

అంటే మంచి ప్రేమ కథతోనే గౌతమ్‌ ఎంట్రీ ఇచ్చాడన్నమాట. ఇక ఇప్పటికే గౌతమ్‌ బాల నటుడిగా తెరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. మహేశ్‌ బాబు హీరోగా తెరకెక్కిన ‘వన్‌ నేన్కొక్కడినే’ సినిమాలో చిన్ననాటి మహేష్‌గా అలరించాడు. మహేష్ సినిమాల సంగతి చూస్తే.. రాజమౌళి (Rajamouli) దర్శకత్వంలో ఓ సినిమా చేయాల్సి ఉంది. కేఎల్ నారాయణ నిర్మాణంలో రూపొందనున్న ఈ సినిమా ఎప్పుడు స్టార్ట్‌ అవుతుంది అనే విషయంలో చాలా పుకార్లు వచ్చినా ఎక్కడా క్లారిటీ లేదు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus