Priyanka Chopra: షూటింగ్‌లో ప్రియాంకకు గాయం.. నిజం కాదా? ఏం జరిగింది?

ప్రముఖ కథానాయిక, గ్లోబల్‌ స్టార్‌ ప్రియాంక చోప్రా (Priyanka Chopra) ఇటీవల గాయపడింది అని మీరు వార్తల్లో చూసే ఉంటారు, చదివే ఉంటారు కూడా. అయితే నిజంగానే ఆమె గాయపడిందా? లేక షూటింగ్‌ కోసం అలాంటి మేకప్‌ వేసుకొని ఫొటోలు దిగి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసింది.. కొత్త సినిమా ‘ది బ్లఫ్’ షూటింగ్‌లో భాగంగా ఆమెకు మెడ దగ్గర గాయమైంది. దీని గురించి ప్రియాంక ఇటీవల సోషల్ మీడియాలో పోస్ట్‌ చేసింది. అయితే ఆ గాయం నిజం కాదు అని అంటున్నారు నెటిజన్లు.

‘ది బ్లఫ్‌’ సినిమా షూటింగ్ ఆస్ట్రేలియాలో జరుగుతోంది. ఈ క్రమంలోనే తనకు ప్రమాదం జరిగింది అని ప్రియాంక చెప్పింది. ‘వృత్తి జీవితంలో ఎదురయ్యే ప్రమాదాలు’ అంటూ ప్రమాదం, గాయానికి సంబంధించిన ఫొటోలను షేర్‌ చేసింది. ప్రమాదం జరిగిన వెంటనే ప్రియాంకను సిడ్నీలోని ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు ఆమె వెంటనే చికిత్స అందించారని కూడా వార్తలొచ్చాయి. ఫొటోలు చూస్తే ముఖం, పెదవి, మెడ భాగాల్లో గాయాలైనట్టు అర్థమవుతోంది.

అంతేకాదు మెడ వద్ద నిటారుగా చీరుకున్నట్లుగా గాయం కనిపిస్తోంది. అయితే ప్రమాద తీవ్రత అంత ఎక్కువగా ఏమీ లేదని చెప్పారు. అయితే ఇటీవల ప్రియాంక షేర్‌ చేసిన వీడియోలు, ఫొటోలు చూస్తే మెడ మీద తగిలిన గాయం మళ్లీ కనిపించడం లేదు. ముఖానికి షూటింగ్‌ సందర్భంగా వేసిన రంగు మాత్రమే కనిపిస్తోంది. దీంతో ఆమెకు గాయమైందా? లేదా? అనే డౌట్‌ ఆమె పోస్టు కింద కామెంట్స్‌లో కనిపిస్తోంది.

ఆమె నటి అనే విషయం మరచిపోయారా? ఏంటి? గాయమైంది అనేది కూడా నటనే లాంటి కామెంట్స్‌ ఆమె లేటెస్ట్‌ పోస్టు కింద కనిపిస్తున్నాయి. మరి నిజంగానే ఆమె గాయమైందా? లేదా? ఒకవేళ గాయమైతే కొత్త పోస్టులో ఆ గాయం ఎందుకు కనిపించడం లేదు అనేదే ప్రశ్న. ఆమెకు గాయం కాకూడదు అనేదే అందరి కోరిక. అయితే ఇలా గాయమైంది అని కావాలని ఎందుకు చెప్పడం అనేదే ప్రశ్న.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus