టాలీవుడ్ ఇండస్ట్రీలో నటుడుగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న మహేష్ బాబు సేవా కార్యక్రమాలను చేయడంలో కూడా ముందు వరుసలో ఉంటారు. ఈయన ఒక వైపు సినిమాలలో నటిస్తూనే మరోవైపు తన ఫౌండేషన్ ద్వారా ఎంతో మందికి సహాయ సహకారాలు చేస్తున్నారు.ఇప్పటికే రెండు గ్రామాలను దత్తత తీసుకున్న మహేష్ బాబు తన ఫౌండేషన్ ద్వారా రెయిన్ బో ఆంధ్ర హాస్పిటల్స్ లో చిన్నపిల్లలకు గుండె ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. ఈ విధంగా మహేష్ బాబు తన ఫౌండేషన్ ద్వారా ఎంతో మంది చిన్నారుల గుండె ఆపరేషన్ చేయించి వారికి పునర్జన్మను ప్రకటించారు.
ఇలా ఎన్నో సేవా కార్యక్రమాలలో పాల్గొంటున్న మహేష్ బాబు తన ఫౌండేషన్ ద్వారా చేసే సేవా కార్యక్రమాలు మరింత మందికి చేరువ అవడం కోసం ప్రత్యేక వెబ్ సైట్ ప్రారంభించారు. ఇక ఈ విషయాన్ని మహేష్ బాబు గారాల పట్టి సితార ఘట్టమనేని తన సోషల్ మీడియా ఖాతా ద్వారా అధికారకంగా తెలియజేశారు. నూతన సంవత్సరంలో మా అధికారక వెబ్ సైట్ ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది. ఫౌండేషన్ తరపున అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలని తెలియజేయడమే కాకుండా
తన వంతు సహాయంగా ఫౌండేషన్ కి తన పాకెట్ మనీని విరాళంగా ఇస్తున్నట్లు సితార తెలిపారు. ఈ విధంగా సితార ఇంత చిన్న వయసులోనే ఎంతో సేవా గుణం కలిగి ఉండడంతో మహేష్ అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.ఇకపోతే మహేష్ బాబు తన ఫ్యామిలీతో కలిసి నూతన సంవత్సర వేడుకలను జరుపుకోవడం కోసం స్విట్జర్లాండ్ వెళ్లారు. అక్కడే ఈయన కొత్త సంవత్సరానికి స్వాగతం పలికారు. ఈ వెకేషన్ పూర్తి కాగానే మహేష్ బాబు త్రివిక్రమ్ సినిమాతో బిజీ కానున్నారు.
బటర్ ఫ్లై సినిమా రివ్యూ& రేటింగ్!
2022లో అలరించిన తెలుగు సినిమాలు ఇవే!
ఇప్పటవరకూ ఎవరు చూడని శ్రీలీల రేర్ ఫోటో గ్యాలరీ!!
‘ఖుషి’ పవన్ ఫ్యాన్స్ కు ఒక డ్రగ్ లాంటిది..రీ రిలీజ్ లో ఎందుకు చూడాలి అంటే..?