ఎన్టీఆర్ గ్యారేజ్ లో మహేశ్..!

  • September 5, 2016 / 12:35 PM IST

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన “జనతా గ్యారేజ్’ ఏ ముహూర్తాన ఇచట అన్నీ రేపేర్లు చేయబడును అన్న ట్యాగ్ తగిలించుకుందో తెలీదు కానీ, మొత్తానికి మిక్స్డ్ టాక్ తో మొదలై ఇప్పుడున్న రికార్డులను అన్నింటినీ రిపేర్స్ చేస్తుంది. అయితే మైత్రి మూవీస్ వారి నిర్మాణ విలువలు సినిమాకి బలంగా నిలిచాయనడం నిస్సందేహం. ముఖ్యంగా కళా దర్శకుడు ఏ ఎస్ ప్రకాశ్ రూపొందించిన సెట్స్ కు మంచి పేరొచ్చింది. ఎన్టీఆర్ తిరుగాడిన ఇదే సెట్స్ లో ఇప్పుడు మహేష్ సందడి చేయనున్నాడట.

‘బ్రహ్మోత్సవం’ తర్వాత మహేశ్ బాబు మురుగదాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించి ఓ షెడ్యూల్ చెన్నైలో చేసేందుకు దర్శకుడు సన్నాహాలు చేస్తున్నారు. అది పూర్తవగానే హైదరాబాద్ చేరుకోనున్న మహేష్-మురుగదాస్ బృందం ‘జనతా గ్యారేజ్’ కోసం వేసిన సెట్లలో కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నట్టు భోగట్టా. కొద్దిపాటి మార్పులు చేసి ఓ పాట సహా కొన్ని యాక్షన్ సన్నివేశాలను ఆ సెట్లో షూట్ చేయనున్నారు. అలా గ్యారేజ్ లో మహేష్ ఎంట్రీ ఇస్తాడన్నది పరిశ్రమ వర్గాల కథనం. మరి ఈ గ్యారేజ్ మహేశ్ కి ఎలాంటి ఫలితాన్ని మిగులుస్తుందో..?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus