మరో చిన్న హీరోను టార్గెట్ చేసిన మహేష్ బాబు

  • December 14, 2020 / 10:01 PM IST

టాలీవుడ్ ఇండస్ట్రీలో సీనియర్ స్టార్ హీరోలు కూడా భారీ స్థాయిలో సినిమాలను నిర్మించడానికి రెడీ అవుతున్నారు. మహేష్ బాబు చాలా వరకు తన సినిమాలకు హోమ్ ప్రొడక్షన్ G మహేష్ బాబు పేరును సపోర్ట్ గా ఉంచుకుంటు ప్రమోట్ చేస్తూ వస్తున్నాడు. కుదిరితే బయట హీరోలతో కూడా సినిమా చేయడానికి సిద్దమైన ప్రిన్స్ త్వరలో అడవి శేష్ మేజర్ వినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు మరో హీరోపై కూడా స్పెషల్ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది.

వీలైనంత వరకు చిన్న బడ్జెట్ లోనే సినిమాలను నిర్మించాలని అనుకుంటున్నా మహేష్ ..నవీన్ పొలిశెట్టిని కూడా లైన్ లో పెట్టేందుకు రెడీ అవుతున్నట్లు టాక్. మహేష్ బాబు 1 నేనొక్కడినే సినిమాలో ఒక స్పెషల్ పాత్రలో కనిపించి మంచి క్రేజ్ అందుకున్న నవీన్ ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ సినిమాతో హోరోగా కూడా క్లిక్కయ్యాడు. ఇక బాలీవుడ్ చిచ్చోరే సినిమాలో అతను చేసిన ఒక స్పెషల్ రోల్ కూడా బాగానే క్లిక్కయ్యింది.

మహేష్ బాబు అతని టాలెంట్ గురించి తెలుసుకొని G మహేష్ బాబు ప్రొడక్షన్ లో సినిమా చేసేందుకు ఆఫర్ ఇచ్చినట్లు సమాచారం. ప్రస్తుతం రెండు కథలను రెడీగా ఉంచిన మహేష్ నవీన్ కి అందులో సరిపడే కథను ఫైనల్ చేస్తారట. ఇక వచ్చే ఏడాది మేజర్ సినిమా షూటింగ్ పూర్తి కాకముందే నవీన్ తో చేయాల్సిన ప్రాజెక్టు ఎనౌన్స్మెంట్ ఇవ్వాలని ఫిక్స్ అయ్యారట. మరి ఈ గాసిప్ ఎంతవరకు నిజమో తెలియాలి అంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.

Most Recommended Video

2020 Rewind: ఈ ఏడాది డిజాస్టర్ సినిమాలు ఇవే..!
ఈ 10 మంది సినీ సెలబ్రిటీలు పెళ్లి కాకుండానే పేరెంట్స్ అయ్యారు..!
లాక్ డౌన్ టైములో పెళ్లిళ్లు చేసుకున్న టాలీవుడ్ సెలబ్రిటీస్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus