Mahesh Babu, Namrata: నమ్రత మహేష్ ను ఆ ముద్దు పేరుతో పిలుస్తారా.. అస్సలు ఊహించలేరుగా!

  • April 29, 2024 / 03:17 PM IST

మహేష్ బాబు (Mahesh Babu)  నమ్రత (Namrata) క్యూట్ కపుల్ గా ఇండస్ట్రీలో మంచి పేరు సంపాదించుకున్నారు. ప్రేమించి పెళ్లి చేసుకుని అన్యోన్యంగా ఉన్న ఈ జోడీని అభిమానులు ఎంతో అభిమానిస్తారు. అయితే మహేష్ బాబును నమ్రత ప్రేమగా బేబీ అని పిలుస్తారట. ఒక సినిమా ఈవెంట్ లో భాగంగా నమ్రత సిగ్గు పడుతూ ఈ విషయాలను వెల్లడించారు. నమ్రత మహేష్ ను బేబీ అని పిలుస్తారని తెలిసి నెటిజన్లు సైతం ఆశ్చర్యపోతున్నారు. మహేష్ బాబు నమ్రత వంశీ (Vamsi) అనే సినిమాలో కలిసి నటించిన సంగతి తెలిసిందే.

ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది. పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉన్న నమ్రత భవిష్యత్తులో కూడా కలిసి నటించే అవకాశం లేదని తెలుస్తోంది. వయస్సులో మహేష్ బాబుతో పోల్చి చూస్తే నమ్రత పెద్ద అనే సంగతి తెలిసిందే. మహేష్ బాబు రాజమౌళి (S. S. Rajamouli) కాంబో సినిమాకు సంబంధించి శరవేగంగా పనులు జరుగుతున్నాయి. సరైన ప్రణాళికతో షూటింగ్ జరిగేలా మేకర్స్ ప్లానింగ్ ఉందని తెలుస్తోంది.

పాన్ వరల్డ్ మూవీగా ఈ సినిమా తెరకెక్కనుండగా మే నెల 31వ తేదీన ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల కానుంది. ఇప్పటికే మహేష్ బాబు హెయిర్ స్టైల్ ను మార్చుకున్నారు. ఫారెస్ట్ అడ్వెంచర్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా తెరకెక్కుతుండటం గమనార్హం. ఈ సినిమాపై హైప్ అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం. ఈ సినిమాలో విజువల్ ఎఫెక్స్ట్స్ కు ఎక్కువగా ప్రాధాన్యత ఉండనుందని సమాచారం అందుతోంది.

దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది. 2026 సంవత్సరంలో ఈ సినిమా విడుదలయ్యేలా రాజమౌళి ప్లాన్ ఉందని సమాచారం అందుతోంది. మహేష్ సినిమా విడుదలైన తర్వాత జక్కన్న ఏ హీరోతో సినిమా తెరకెక్కిస్తారో చూడాల్సి ఉంది. జక్కన్న డైరెక్షన్ లో నటించడానికి చాలామంది హీరోలు ఆసక్తి చూపిస్తున్నారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus