Ramayana: హిందీ ‘రామాయణం’ లీక్డ్ పిక్స్ వైరల్..!

బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ (Om Raut) ఆల్రెడీ రామాయణాన్ని ‘ఆదిపురుష్’ (Adipurush) గా తీశాడు. ఆ సినిమాపై చాలా విమర్శలు వెల్లువెత్తాయి. రాముడి గెటప్ నుండి, సీత పాత్రలో కృతి సనన్ (Kriti Sanon) వస్త్రాలంకరణ, రావణాసురిడి వాహనంగా గబ్బిలాన్ని చూపించడం, రావణ లంకని గ్రాఫిక్స్ లో మేనేజ్ చేయడం.. హనుమంతుడితో అసభ్యకరమైన పదజాలాన్ని పలికించడం.. ఇలా ఒక్కటేంటి చాలా విధాలుగా రామాయణాన్ని మార్చేసి తనకు నచ్చినట్టు తీశాడు దర్శకుడు ఓం రౌత్. ప్రభాస్ (Prabhas) కూడా చాలా ట్రోల్స్ ఫేస్ చేయాల్సి వచ్చింది.

ఇంకోరకంగా బాలీవుడ్ ఫిలిం మేకర్స్ కి రామాయణం, మహాభారతం గొప్పతనం తెలీదు అని నెగిటివ్ కామెంట్స్ చేసిన బ్యాచ్ కూడా చాలా మందే ఉన్నారు. సరే ఆ విషయాలను పక్కన పెట్టేస్తే..’ఆదిపురుష్’ వచ్చి ఏడాది కాకుండానే మళ్ళీ రామాయణాన్ని రూపొందిస్తున్నారు బాలీవుడ్ ఫిలిం మేకర్స్. నితీష్ తివారి (Nitesh Tiwari) డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రంలో శ్రీరాముని పాత్రలో రణబీర్ కపూర్ (Ranbir Kapoor) , సీతాదేవి పాత్రలో సాయి పల్లవి (Sai Pallavi) నటిస్తున్నారు.

కేజీఎఫ్ స్టార్ యష్ కూడా ఇందులో భాగం కానున్నాడని టాక్ జరిగింది. అందులో ఎంతవరకు నిజముందో తెలీదు కానీ.. ఈ సినిమా కోసం మేకర్స్ మద్యం, మాంసాహారానికి దూరంగా ఉండి ఎంతో నిష్టగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్టు చెప్పుకొస్తున్నారు. ఇదిలా ఉండగా.. ఇటీవల తొలి షెడ్యూల్ ప్రారంభమైంది. దానికి సంబంధించిన లీక్డ్ పిక్స్ కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సాయి పల్లవి సీత పాత్రలో ఎంతో చక్కగా ఉంది. ఆ ఫోటోలు మీరు కూడా ఓ లుక్కేయండి :

Read Today's Latest Gallery Update. Get Filmy News LIVE Updates on FilmyFocus