Malaika Arora: ఇప్పుడు మలైకా అరోరా ఎలా తయారయ్యిందో చూస్తే నోరెళ్లబెడుతారు!

మన టాలీవుడ్ లో ఎప్పటికీ చిరకాలం గుర్తుండిపోయ్యే కొన్ని ఐటెం సాంగ్స్ ఉంటాయి, ఆ ఐటెం సాంగ్స్ ని ఎన్ని సార్లు విన్నా కూడా బోర్ కొట్టదు. మళ్ళీ మళ్ళీ వినాలని అనిపిస్తుంది, అలాంటి ఐటెం సాంగ్స్ లో ఒకటి ‘కెవ్వు కేక’. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు హరీష్ శంకర్ కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా ఆరోజుల్లో ఎంత పెద్ద సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే.

వరుస ఫ్లాప్స్ లో ఉన్న పవన్ కళ్యాణ్ కి తిరుగులేని బ్లాక్ బస్టర్ హిట్ గా నిల్చింది ఈ చిత్రం. ఈ సినిమా అంత పెద్ద హిట్ అవ్వడానికి ప్రధాన కారణాలలో ఒకటి సాంగ్స్. ఈ చిత్రం లోని పాటలు సినిమా విడుదలకు ముందే సెన్సేషనల్ హిట్స్ గా నిలిచాయి. ఇక విడుదల తర్వాత ఆకాశమే హద్దు అనే రేంజ్ లో రీచ్ అయ్యింది జనాలకు. అయితే ఈ సినిమాలో చిన్న పిల్లల దగ్గర నుండి పండు ముసలోళ్ల వరకు థియేటర్స్ లో పూనకాలు వచ్చినట్టు ఊగిపొయ్యెలా చేసిన పాట ‘కెవ్వు కేక’.

ఈ పాటలో పవన్ కళ్యాణ్ మామూలు జోష్ తో డ్యాన్స్ వెయ్యడు, ఆయనతో పాటుగా కలిసి చిందులేసిన నటి పేరు మలైకా అరోరా. ఈమె మన టాలీవుడ్ ఆడియన్స్ కి పెద్దగా పరిచయం అయితే లేదు కానీ, బాలీవుడ్ లో మాత్రం పెద్ద ఫేమస్. అక్కడ ఎన్నో సినిమాల్లో హీరోయిన్ గా నటించింది, ఎన్నో సినిమాల్లో ఐటెం సాంగ్స్ కూడా చేసింది. అంతే కాదు టెలివిజన్ లో ఎన్నో రియాలిటీ షోస్ కి హోస్ట్ గా కూడా వ్యవహరించింది మలైకా అరోరా.

2022 వ సంవత్సరం వరకు సినిమాల్లో యాక్టీవ్ కనిపించిన (Malaika Arora) ఈమె ఆ తర్వాత సినిమాలకు దూరం అయ్యింది. ఇక పోతే ఈమె ప్రముఖ బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ తమ్ముడు అర్భాజ్ ఖాన్ ని ప్రేమించి పెళ్లాడింది. ఆ తర్వాత కొన్నాళ్ళకు అతనితో విడిపోయి అర్జున్ కపూర్ ని పెళ్లాడింది, ప్రస్తుతం అతనితో కలిసి జీవితం కొనసాగిస్తుంది. ఇక పోతే ఈమెకి సంబంధించిన లేటెస్ట్ ఫోటోలు కొన్ని మీకోసం అందిస్తున్నాము చూసి ఎంజాయ్ చెయ్యండి.

అశ్విన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

ఆ హీరోయిన్లలా ఫిట్ నెస్ కంటిన్యూ చేయాలంటే కష్టమే?
తన 16 ఏళ్ళ కెరీర్లో కాజల్ రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus