మాస్ మహారాజ్ ఆఫర్ నే రిజెక్ట్ చేసిన ‘మాష్టర్’ హీరోయిన్..!

Advertisement

రవితేజ ఇప్పుడు ‘క్రాక్’ చిత్రంలో నటిస్తున్నాడు. గోపీచంద్ మలినేని డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం కొద్ది పాటి షూటింగ్ ఫినిష్ చేసుకుంటే కంప్లీట్ అయిపోయినట్టే. ఈ చిత్రం తర్వాత ‘రైడ్’ ‘రాక్షసుడు’ వంటి హిట్ చిత్రాలను అందించిన రమేష్ వర్మ డైరెక్షన్లో ఓ చిత్రం చెయ్యడానికి రెడీ అవుతున్నాడు రవితేజ. కోనేరు సత్యనారాయణ తనయుడు యువ హీరో హవీష్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నాడు. అయితే ఈ చిత్రంలో కీలక పాత్ర కోసం మలయాళం నటి మాళవిక మోహనన్ తీసుకోవాలి అనుకున్నారట.

ఇందులో భాగంగా ఆమెను సంప్రదిస్తే.. ‘ఇప్పట్లో నాకు తెలుగు సినిమాల్లో నటించే ఇంట్రెస్ట్ లేదు’ అంటూ సున్నితంగా తిరస్కరించిందట. ప్రస్తుతం ఈమె తమిళంలో విజయ్ హీరోగా నటిస్తున్న ‘మాష్టర్’ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తుంది. గతంలో రజినీ కాంత్ ‘పేట’ చిత్రంలో ఈమె నటించింది. ఆ చిత్రంలో పేట(రజినీకాంత్) స్నేహితుడు మాలిక్ భార్యగా ఈమె నటించింది. చెప్పాలంటే ఈమెకు అవకాశాలు పెద్దగా లేవు. షారుఖ్ ఖాన్ ‘డాన్’ , మహేష్ బాబు ‘మహర్షి’ చిత్రాలకు సినిమాటోగ్రఫీ అందించిన కె.యు మోహనన్ కూతురు అయినప్పటికీ… మాళవిక మోహనన్ కు ఏమాత్రం క్రేజ్ లేదు.

అలాంటిది ఇప్పుడు రవితేజ సినిమాలో ఛాన్స్ రావడం అంటే.. గొప్ప విషయం అనే చెప్పాలి. అయినప్పటికీ ఈమె ఆ ఆఫర్ ను రిజెక్ట్ చేసింది. ఈమెకు కథల పట్ల సరైన డెసిషన్ తీసుకోవడం తెలీదు.. కనీసం మంచి ప్రాజెక్ట్ లు ఎంచుకోవడం కూడా రాదు.. అని కొంతమంది విశ్లేషకులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి.

Most Recommended Video

మేకప్‌ లేకుండా మన టాలీవుడ్ ముద్దుగుమ్మలు ఎలా ఉంటారో తెలుసా?
జ్యోతిక ‘పొన్‌మగల్‌ వందాల్‌’ రివ్యూ
ఈ డైలాగ్ లు చెప్పగానే గుర్తొచ్చే హీరోయిన్లు!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus