Mana ShankaraVaraPrasad Garu Twitter Review: మన శంకర్ వరప్రసాద్ గారు సినిమాతో చిరు కంబ్యాక్ ఇచ్చినట్టేనా? ట్విట్టర్ టాక్ ఇదే!

మెగాస్టార్ చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ ‘మన శంకరవర ప్రసాద్ గారు’. షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. టీజర్, ట్రైలర్ ఆకట్టుకున్నాయి. శశిరేఖ, మీసాల పిల్లా , హుక్ స్టెప్ వంటి పాటలు సినిమా పై హైప్ క్రియేట్ చేశాయి. ఈ సినిమాలో వెంకటేష్ కూడా నటించడం అందరిలోనూ ఆసక్తి పెంచాయి. ఆల్రెడీ కొన్ని చోట్ల షోలు పడ్డాయి.

Mana ShankaraVaraPrasad Garu Movie Twitter Review

సినిమా చూసిన వాళ్ళు ట్విట్టర్ ద్వారా తమ అభిప్రాయాలు వెల్లడిస్తున్నారు. వారి టాక్ ప్రకారం.. మన శంకర్ వరప్రసాద్ గారు ఇంట్రెస్టింగ్ గా స్టార్ట్ అయ్యిందట. చిరు ఎంట్రీ పెద్దగా హడావిడి లేకుండా సింపుల్ గా ఉంది అని అంటున్నారు. అటు తర్వాత కామెడీ జోన్ లోకి సినిమా టర్న్ అయ్యిందట. ఫస్ట్ ఫైట్ చిరు రేంజ్ కి తగ్గట్టు ఉంటుందట. ఆ తర్వాత హుక్ స్టెప్ సాంగ్ వస్తుందట.

అది అందరికీ జోష్ ఇస్తుందట. ఆ తర్వాత ఫ్లాష్ బ్యాక్ సీన్స్ వస్తాయట. కొంచెం ఎమోషనల్ గా ఉంటుందట. అటు తర్వాత పిల్లల ఎపిసోడ్స్ వస్తాయట. అక్కడ కూడా చిరు పెర్ఫార్మెన్స్ అదిరింది అని అంటున్నారు. ఇంటర్వల్ సీక్వెన్స్ మాత్రం మంచి హై ఇస్తుంది అంటున్నారు. ఇక సెకండాఫ్ మాత్రం అదిరిపోయింది అంటున్నారు. చిరు ఇమేజ్ కి తగ్గ ఎలివేషన్ సెన్స్ బ్యాక్ టు బ్యాక్ వస్తాయట. క్లైమాక్స్ లో వెంకటేష్ ఎంట్రీ కూడా అదిరిపోయింది అంటున్నారు. మరి మార్నింగ్ షోలతో ఎలాంటి టాక్ వస్తుందో చూడాలి..

 

ప్రభాస్‌ సినిమాల్లో కచ్చితంగా ఓ పాట.. ఎందుకో చెప్పిన లిరిక్‌ రైటర్‌

 

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus