ప్రభాస్ ఫేవరెట్ లిరిక్ రైటరా మీరు? అని అడుగుతుంటారు ఆయన్ని. అలా అడగడానికి ఓ కారణం కూడా ఉంది. ప్రభాస్ గత కొన్నేళ్లుగా చేస్తున్న సినిమాల్లో కచ్చితంగా ఆయన ఓ పాట రాస్తున్నారు మరి. ఆయనే కేకే. ‘ప్రభాస్ రాజా సాబ్’ సినిమాలో ‘సహనా సహానా’ పాటను ఆయనే రాశారు. గతేడాది ఆయనకు పెద్ద ఎత్తున హిట్ సాంగ్స్ కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆయన ఓ మీడియాతో మాట్లాడుతూ కెరీర్ గురించి, ప్రభాస్‌తో సినిమాల గురించి మాట్లాడారు. ఇప్పుడు ఆ మాటలు వైరల్ అవుతున్నాయి.
కేకే గతేడాది 50కిపైగా సినిమాలకి పాటలు రాశారట. అందులో 22 సినిమాలు విడుదలయ్యాయట. వాటిలో ఆయన రాసిన 45 పాటలు ఉన్నాయట. ‘వైబ్ ఉంది…’ (మిరాయ్), ‘మల్లిక గంధ..’, ‘సొగసు చూడతరమా..’ (తెలుసు కదా), ‘మోనికా..’ (కూలీ) లాంటి హిట్ సంగ్స్ ఉన్నాయి. వాటిలోపాటు ‘కింగ్డమ్’లో పాటలన్నీ ఆయనే రాశారు. ఈ ఏడాది కూడా అదే స్థాయిలో పాటలు ఉంటాయి అని చెబుతున్నారాయన. ప్రభాస్ ‘ఫౌజీ’, ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ సినిమాలో పాటలు రాస్తున్నట్లు తెలిపారు.
ఈ నేపథ్యంలో ప్రభాస్ ప్రతి సినిమాలో పాట రాస్తున్నారు ఎలా? అనే ప్రశ్న వచ్చింది. దానికి కేకే రియాక్ట్ అవుతూ.. ఆయన సినిమాల్లో పని చేసే అవకాశం నాకు లభిస్తుండడానికి కారణం ఆయనతో పని చేస్తున్న దర్శకులంతా నా స్నేహితులు కావడమే అని తేల్చేశారు. అలాగే ప్రభాస్‌కి సాహిత్యం విషయంలో ఎంతో పరిజ్ఞానం ఉంటుందని చెప్పారు. అయితే ఆయన పాటకు సంబంధించిన బాధ్యతలన్నీ దర్శకులకే అప్పజెప్పేస్తారు అని క్లారిటీ ఇచ్చారు కేకే. నాని సినిమాలకు కూడా తరచూ రాస్తుంటాను. పాటల విషయంలో ఆయన కూడా ప్రభాస్ లాగే ఉంటారు. అయితే అప్పుడప్పుడూ చిన్న చిన్న మార్పులు సూచిస్తుంటారు అని చెప్పారు.