Manchu Lakshmi: నేను తెలుగు యాక్టర్ కాదు, తమిళ్ యాక్టర్ కాదు : మంచు లక్ష్మీ

మంచు లక్ష్మీ(Manchu Lakshmi) ఏం మాట్లాడినా సెన్సేషనే..! ఎందుకంటే ఆమె మీడియా ముందుకు వచ్చింది అంటే ట్రోలర్స్ అంతా అలర్ట్ అయిపోతారు. ఆమె మాట్లాడే విధానాన్ని వక్రీకరిస్తూ.. ఓ రేంజ్లో మీమ్స్ చేస్తూ ఉంటారు. అయితే ఒక్కోసారి మంచు లక్ష్మీ పలికే కొన్ని డైలాగులు ఆకట్టుకుంటాయి. ఎంతో ధైర్యంగా ఆమె మనసులో ఉన్నది మైక్లో పలుకుతూ ఉంటుంది. అవి బాగుంటాయి. ఇప్పుడు కూడా తాను వరల్డ్ యాక్టర్ ని అంటూ పలికిన డైలాగ్ ఆకట్టుకుంటుంది.

Manchu Lakshmi

దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది. విషయం ఏంటంటే.. విజయ్ ఆంటోనీ నిర్మాణంలో రూపొందిన ‘బూకీ’ సినిమాలో మంచు లక్ష్మీ నటించింది. ఈ సినిమా తెలుగు రిలీజ్ ప్రమోషన్స్ లో భాగంగా ఈరోజు హైదరాబాద్లో ఓ ప్రెస్ మీట్ ను ఏర్పాటు చేశారు.ఇందులో భాగంగా ఓ రిపోర్టర్.. ‘తమిళంలో మీ స్లాంగ్ ఎలా ఉంటుందో చూడాలని ఉంది’ అంటూ మంచు లక్ష్మీని ప్రశ్నించాడు.

అందుకు మంచు లక్ష్మీ.. “నాకు తమిళం మాట్లాడటం చాలా బాగా వచ్చు. ఎందుకంటే నేను పుట్టి పెరిగింది అంతా తమిళనాడులో అదీ చెన్నైలో.. కాబట్టి నాకు తమిళం తెలుసు” అంటూ ఆమె తమిళంలో పలికింది. ఆమె తమిళం మాట్లాడిన విధానం బాగుంది. అబ్బురపరిచింది. అలాగే తమిళంలో నటించడం అనేది గర్వంగా అనిపిస్తుంది. ఎందుకంటే అన్ని భాషల్లోని నటులు తెలుగులోకి వచ్చి పెద్ద నటీనటులు అవుతున్నారు.

కానీ మన తెలుగు వాళ్ళు మాత్రం ఎక్కడికీ వెళ్లడం లేదు. వెళ్లలేకపోతున్నారా? అనిపిస్తుంది. మనమైతే హారతులు ఇచ్చి, పూలదండలు వేసి మరీ తీసుకొస్తాం. మనల్ని మాత్రం వేరే భాషల్లోకి అడుగు కూడా పెట్టనివ్వడం లేదు. అలాంటిది నేను మలయాళంలో, హిందీలో, తమిళంలో చేయడం ఆనందంగా అనిపిస్తుంది. అన్ని భాషల్లోనూ సినిమాలు చేయాలన్నది నా కోరిక. నేను తెలుగు, తమిళ యాక్టర్ ని మాత్రమే కాదు వరల్డ్ యాక్టర్ ని” అంటూ చెప్పుకొచ్చింది.

25 ఏళ్ళ క్లాసిక్ ‘మురారి’ కి సంబంధించిన ఆసక్తికర విషయాలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus